అమ్మాయిలు చిన్నగా హేయిర్ కట్ చేసుకుంటే అబ్బాయిలకు నచ్చుతుందా ?

ఒకప్పుడు బేబి కటింగ్ అనేది బాగా ఫేమస్.చిన్నగా జుట్టు కత్తిరించుకున్న చిన్నపిల్లలను బేబి కట్ ఫేస్ అని పిలిచేవారు.

 Do Men Like Women In Short Hair?-TeluguStop.com

ఫ్యాషన్ ట్రెండ్ మారినాకొద్దీ అమ్మాయిల హేయిర్ కట్ ట్రెండ్స్ లో చాలా మార్పులు వచ్చాయి.ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, వయసులో ఉన్న అమ్మాయిలు కూడా చిన్నగా జుట్టు కత్తరించుకంటున్నారు.

ఇదోరకం ఫ్యాషన్ మరి.

కాని అమ్మాయిలు ఇలా జుట్టు చిన్నగా కత్తిరించుకుంటే అబ్బాయిలకు నచ్చుతుందా ? చిన్న జుట్టుతో ఉండే అమ్మాయిలు అబ్బాయిల కంటికి ఎలా కనిపిస్తారు ? అసలు చిన్న జుట్టులో అమ్మాయిలను చూడటం అబ్బాయిలకు ఇష్టమేనా ? ఇలాంటి ప్రశ్నలే అబ్బాయిలను అడిగింది ఓ అమెరికన్ లైఫ్ స్టయిల్ మ్యాగజీన్.

ఆశ్చర్యకరంగా నెగేటివ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు.కాని కాస్త లావుగా ఉండే అమ్మాయిలు షార్ట్ హేయిర్ కట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని అభిప్రాయపడ్టారు.అలా కాకుండా స్లిమ్ గా, మామూలు షేప్ లో ఉండే అమ్మాయిలు షార్ట్ హేయిర్ లో సెక్సీగా కనిపిస్తారని, ఉదాహరణకి షార్ట్ హేయిర్ లో కూడా మురిపించిన ఎమ్మా వాట్సన్, కిర్ స్టెన్ స్టీవార్ట్ లాంటి హాలివుడ్ భామల పేర్లు చెప్పుకొచ్చారు.

అయితే ఈ సర్వే అమెరికాలో జరిగింది కాబట్టి, భారతీయ అమ్మాయిలు షార్ట్ హెయిర్ కట్ చేయించుకునే ముందు అలోచిస్తేనే మంచిది.

ఇక్కడి అబ్బాయిల టేస్ట్ ని మనం అంచనా వేయలేం కదా.పీకే చిత్రంలో అనుష్క శర్మ షార్ట్ హేయిర్ ట్రై చేసినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube