బ్రెస్ట్‌ క్యాన్సర్ బాధితులు పుట్ట‌గొడులు తింటే ఏం అవుతుందో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో ఎంద‌రో స్త్రీలు బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వ‌య‌సు పైబ‌డ‌టం, రేడియేషన్, ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవడం, మ‌ద్యపానం, అధిక బ‌రువు, రొమ్ములో కణితులు ఉండ‌టం, హార్మోన్ల అసమ‌తుల్యత, ఆహారపు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ్రెస్ట్ క్యాన్స‌ర్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

 Do Breast Cancer Victims Know What Happens When They Eat Mushrooms? Mushrooms, E-TeluguStop.com

జన్యుపరమైన కారణాలు వ‌ల్ల కూడా కొంద‌రు ఈ వ్యాధికి గుర‌వుతారు.అయితే దీనిని ముందే గుర్తించే స‌రైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు.

అలాగే బ్రెస్ట్ క్యాన్స‌ర్ బాధితులు త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్ట‌గొడుగులు.చాలా రుచిగా ఉంటాయి.ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయి.

ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో బాధ ప‌డే వారు.త‌ర‌చూ పుట్ట‌గొడుగుల‌ను తీసుకోవాలి.

త‌ద్వారా పుట్ట‌గొడుగుల్లో ఉండే ప‌లు పోష‌కాలు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నియంత్రించడమే కాకుండా, కొత్త కణాలను నిరోధించడానికి స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రియు రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా రెట్టింపు చేస్తాయి.

అలాగే బ్రెస్ట్ క్యాన్స‌ర్ బాధితుల‌కు ఎంతో మేలు చేసే ఆహారాల్లో బ్రొకోలి ఒక‌టి.రెగ్యుల‌ర్‌గా బ్రొకోలిని ప‌రిమితిని మించ‌కుండా తీసుకుంటే క్యాన్సర్‌ కణితుల పెరుగుదల తగ్గు ముఖం పడుతుంది.దాంతో బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ను వేగంగా జ‌యించ‌వ‌చ్చు.

బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డేందుకు క్యాప్సికం సైతం ఎఫెక్టివ్‌గా స‌మాయ‌ప‌డుతుంది.క్యాపికంను త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే.అందులో ఉండే ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశ‌నం చేస్తాయి.

ఇక ఇవే కాకుండా వాల్ న‌ట్స్‌, చేప‌లు, ప‌సుపు, వెల్లుల్లి, గ్రీన్ టీ, దానిమ్మ పండ్లు, అవిసె గింజ‌లు వంటి ఆహారాలు కూడా డైట్‌లో ఉంటే చాలా ఫాస్ట్ గా బ్రెస్ట్ క్యాన్స‌ర్ ను నివారించుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube