మీరు 1990 కి ముందు పుట్టారా.. అయితే ఇదొకసారి చూడండి, తప్పకుండా మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తారు

మారుతున్న కాలంతో పాటు మనిషి ప్రయాణం సాగిస్తున్నాడు, కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపుచుకుంటూ కొత్త కొత్త ఆ విష్కరణలు చేస్తూ వస్తున్నాడు.మనిషి జీవితంలో అనూహ్య మార్పును తీసుకు వచ్చింది టీవీ అని చెప్పుకోవచ్చు.

 Do Born Before 1990s Then Find It And Remember This-TeluguStop.com

టెలివిజన్‌ రాకతో మానవ ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోయింది.టీవీ అనేది లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే వామ్మో అన్నట్లుగా ఉంది.

ప్రస్తుతం వందలు, వేల చానెల్స్‌ ఉన్నాయి.కేవలం తెలుగులోనే వందల కొద్ది ఛానెల్స్‌ పుట్టుకు వచ్చాయి.

కాని మూడు దశాబ్దాల క్రితం ఉన్నది కేవలం దూరదర్శిన్‌ మాత్రమే.

1990 వరకు దూరదర్శిన్‌ పట్టణాల్లో మరియు పల్లెల్లో విపరీతంగా ఉండేది.ఊరు మొత్తంలో ఒకటి రెండు టీవీలు ఉంటే, వాటి వద్దకు ఊరంతా వచ్చి కూర్చుని చూసేవారు.దూరదర్శిన్‌లో వచ్చే వార్తలు, చిత్రలహరి పాటలు, ఆదివారం వచ్చే సినిమాను అప్పటి జనాలు ఇప్పటికి మర్చి పోలేరు.1990 కి ముందు పుట్టిన వారు ప్రతి ఒక్కరికి దూరదర్శిన్‌తో పరిచయం ఉండి ఉంటుంది.దూరదర్శిన్‌లో రోజంతా కూడా కార్యక్రమాలు వచ్చేవి కాదు.

కొన్ని సమయాల్లో మాత్రమే వచ్చేవి.స్థానిక దూరదర్శిన్‌ ఛానెల్స్‌ లో చాలా తక్కువ సమయం పాటు కార్యక్రమాలు వచ్చేవి, అయితే నేషనల్‌ ఛానెల్స్‌ లో మాత్రం బాగానే వచ్చేవి.

దూదర్శిన్‌ ఛానెల్‌ చూసిన ప్రతి ఒక్కరు రాత్రి ఏడు గంటలకు వచ్చిన వార్తలను చూసే ఉంటారు.అప్పట్లో వార్తలను ఎక్కువగా తెలుగులో శాంతి స్వరూప్ గారు చదివేవారు.వార్తల ముందు వచ్చే ఒక మ్యూజిక్‌ ఇప్పుడు వింటే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడం ఖాయం.వార్తల ప్రారంభం సమయంలో ముఖ్యంశాలు చెప్పే సమయంలో కూడా వచ్చే మ్యూజిక్‌ను 1990కి ముందు పుట్టిన వారు ఎప్పటికి మర్చి పోలేరు.

అయితే ఇప్పుడు ఆ మ్యూజిక్‌ ఎక్కడ కనిపించదు.మీ కోసం, మీ పాత జ్ఞాపకాలను నెమరవేయించేందుకు ఆ మ్యూజిక్‌ ను తీసుకు వచ్చాం.కింది వీడియోలో ఆ పాత మ్యూజిక్‌ ను వినవచ్చు.1990 కి ముందు పుట్టిన మీ స్నేహితులకు మరియు వారి స్నేహితులకు కూడా ఈ అనుభూతిని పంచేందుకు ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube