ఆంధ్రా వాళ్లకు తమిళులు అంటే ద్వేషమా... రెహమాన్ సమాధానం ఇదే?

చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ గురించి సుపరిచితమే.ఈయన అద్భుతమైన సంగీతంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Do Andhra People Hate Tamils This Is Rahmans Answer Andhra People , Tamils, Rahm-TeluguStop.com

అంతేకాకుండా ఈయన ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం.ఇలా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి RRR సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడంపై ఈయన స్పందించారు.

దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఇలా ఒక భారతీయ చిత్ర పరిశ్రమ అది తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన RRR సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండడంపై రెహమాన్ స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడం చాలా సంతోషంగా ఉంది.ఈ పాటకు తప్పనిసరిగా ఆస్కార్ రావాలని దేశమంతా కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాను కూడా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను అంటూ రెహమాన్ ట్వీట్ చేసారు.

ఇలా రెహమాన్ చేసిన ఈ ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.మా తమిళ వాళ్లు తెలుగువారిపై ప్రేమను కురిపిస్తారు.ఇలా తమిళ వాళ్ళు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటారు.

కానీ తెలుగు వారికి తమిళలు అంటే చాలా ద్వేషం అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ పై స్పందించిన రెహమాన్ సమాధానం చెబుతూ మనమంతా ఒకే కుటుంబం.

మన అందరికీ మనస్పర్ధలు రావడం సర్వసాధారణం అయితే మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఒకరికొకరు సాయంగా ఉండాలని, ఒకరికొకరు అండగా నిలబడాలని ఈయన సమాధానం చెప్పారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ బాలీవుడ్ హీరోల విషయంలో అభిమానుల మధ్య తరచూ సోషల్ మీడియా వారు జరుగుతూనే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube