డిఎంకె విజయం నాలుక కోసుకున్న మహిళా కార్యకర్త..!

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో డిఎంకె గెలిస్తే తన నాలుకని అమ్మవారికి కోసుకుని నైవేద్యంగా ఇస్తానని మొక్కుకుంది ఓ డిఎంకె కార్యకర్త వీరాభిమాని.అనుకున్నట్టుగానే డిఎంకె విజయం సాధించడంతో ఆమె మొక్కు తీర్చుకుంది.

 Dmk Woman Cuts Off Tongue Dmk Wins-TeluguStop.com

డిఎంకె అభిమాని మహిళా కార్యకర్త ముత్తలమ్మాన్ అమ్మవారికి తన నాలుక కోసుకుని నైవేద్యంగా ఇచ్చింది.అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షల నిమిత్తం టెంపుల్ మూసి ఉండగా ఆమె నాలుక కోసుకుని అక్కడ గేటుకి తగిలించి మరి వెళ్లింది.

నాలుక కోసుకున్న ఆ మహిళను స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.అప్పట్లో జయలలిత గెలిస్తే కూడా ఇలా నాలుక కోసుకోవడం లాంటి ఘటనలు జరిగాయి.

 Dmk Woman Cuts Off Tongue Dmk Wins-డిఎంకె విజయం నాలుక కోసుకున్న మహిళా కార్యకర్త..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డిఎంకె మహిళా కార్యకర్త చేసిన ఈ పనికి అందరు షాక్ అవుతున్నారు.కరుణానిధి మరణించాక డిఎంకె మొదటిసారిగా ఎన్నికల్లో గెలిచింది. డిఎంకె పదేళ్ల తర్వాత తమిళనాడులో గెలుపు సొంతం చేసుకుంది. స్టాలిన్ మొదటిసారి సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జరిగిన ఎన్నికల్లో డిఎంకె 133 స్థానాల్లో గెలవగా మిత్ర పక్షాలతో కలుపుని 159 స్థానాలను కైవసం చేసుకుంది.డిఎంకె నేత స్టాలిన్ ఈ నెల 7న సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 డిఎంకె విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో కూడా పండుగ వాతావరణం ఏర్పడింది.దశాబ్ధ కాలం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు.

#Tamilanadu #WomanCuts #DMK Stalin #DMk Party #DMK CM

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు