కాంగ్రెస్ కూటమిలో 'కారు'చిచ్చు !  

Dmk To Support Congress-congress,dmk,federal Front,kcr,కేసీఆర్,మోదీ ప్రభుత్వం,రాహుల్,స్టాలిన్ భేటీ

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతుండడం కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీల్లో అనవసరపు ఆందోళన, మనస్పర్థలకు కారణం అవుతోంది. దీనికీ కేసీఆర్ కు ప్రత్యక్షంగా ఏ సంబంధం లేకపోయినా అసలు వివాదానికి మాత్రం కేసీఆర్ కారణం అవుతున్నాడు. ఒకవైపు చూస్తే కేసీఆరే తమకు మద్దతు పలుకుతాడంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుంటున్నారు..

కాంగ్రెస్ కూటమిలో 'కారు'చిచ్చు ! -DMK To Support Congress

కేసీఆర్ కూడా కాంగ్రెస్ కు మద్దతు పలకాల్సిందేనని, అంతకు మించిన గత్యంతరం ఆయనకు ఉండదన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు.ఇది ఇలా ఉండగానే తమిళనాడు పార్టీ డీఎంకే ముఖ్య నేత స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం కావడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

కేసీఆర్, స్టాలిన్ భేటీ సందర్భంగా కూడా స్టాలిన్ రాహుల్ ని ప్రధానిని చేయడమే తన ధ్యేయం అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే డీఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కూటమిలోనే భాగస్వామిగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీకి తమిళనాట ఎనిమిది సీట్లను సైతం ఇచ్చి డీఎంకే స్నేహం చేస్తోంది.

అయితే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకోకుండా రేపు మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి ? అనేది డీఎంకేకి బాగా ఇబ్బందికరంగా తయారయ్యింది.

అన్నాడీఎంకే మీద అన్ని వర్గాల నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఒక వేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగవచ్చు. ఇంకా రెండేళ్ల వరకూ దానికి అధికారకాలం ఉండనే ఉంటుంది.

ఈ పరిణామాల మధ్యన డీఎంకే అధికారం కోసం ఎదురుచూడాల్సి రావొచ్చు. ఇటువంటి పరిణామాలన్నిటిని బేరీజు వేసుకుంటే డీఎంకే కూడా బీజేపీ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అసలు కేసీఆర్ టూర్ వెనుక కూడా బీజేపీనే ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది..