భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో డీఎంకే బృందం భేటీకానున్నారు.తమిళనాడు గవర్నర్ పై రాష్ట్రపతికి డీఎంకే నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
ఈ మేరకు తమిళనాడు మంత్రి రఘుపతి, ఎంపీలు భేటీ అయి గవర్నర్ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు.గవర్నర్ రవి తమిళ ప్రజల ఆత్మ గౌరవాన్ని అపహేళన చేయిస్తోందన్నారు.
తమిళనాడు పేరుని తమిళగం అని మార్చాలంటూ గవర్నర్ రవి బహిరంగంగా వ్యాఖ్యనించారు.అంతేకాకుండా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదంతోనే తన ముందు ఉంచిన ప్రసంగంలోనూ ఉద్దేశ పూర్వకంగానే తమిళనాడు అన్న పేరును కూడా ఆయన విస్మరించిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన తీరుపై చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.