తమిళనాడులో పొత్తుల పర్వం! కాంగ్రెస్ తో దోస్తీ కట్టిన డీఎంకే!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయంగా ఏపీలో నాయకులు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి, ప్రతిపక్షం నుంచి వైసీపీలోకి రాకపోకలు మొదలెట్టారు.మరో వైపు పార్టీ అధినేతలు ఎన్నికల రణరంగానికి అంతా కసరత్తు సిద్ధం చేసుకొని ప్రజలలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

 Dmk Alliance With Congress In Tamil Nadu Elections-TeluguStop.com

ఇదిలా వుంటే పక్క రాష్ట్రం తమిళనాడులో రాజకీయ పొత్తులకి ప్రధాన పార్టీలు తెరతీసాయి.రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే విషయంలో అక్కడ అధికార పార్టీ అన్నాడిఎంకే ఇప్పటికే బీజేపీతో కలిసి పని చేయడానికి నిర్ణయించుకుంది.

బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ సీట్ల పంపకాల విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చేసింది.దీంతో ప్రతిపక్ష డీఎంకే కూడా అధికార పార్టీని ఎదుర్కోవడానికి తన వ్యూహాలతో సిద్ధమైంది.

తాజాగా డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులతో పొత్తుల విషయంపై చర్చించాడు.ఈ చర్చలలో రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది.తమిళనాడులో బలమైన పార్టీగా వున్నా డీఎంకే మెజారిటీ సీట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించడంతో రెండు పార్టీల నాయకులు మీడియా ముఖంగా తమ పొత్తుని ఖరారు చేసారు.

ఓ వైపు తమిళనాడు రాజకీయాలలో కమల్ హసన్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.అదే సమయంలో అన్నాడీఎంకే పార్టీలో అస్థిరత వుంది.

మరో వైపు డీఎంకే పార్టీలో కూడా కుటుంబ కలహాలు వున్నాయి.ఇలాంటి టైంలో తమిళ ఓటర్ నాడి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube