వైసీపీ ప్రభుత్వం పై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన డిఎల్ రవీంద్రా రెడ్డి..!!

Dl Ravindra Reddy Makes Controversial Comments On Ycp Government

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి.వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.జగన్ పరిపాలన లో ప్రజలు ఓడిపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికే న్యాయం జరుగుతుందని తెలిపారు.అంతేకాకుండా ప్రతి పథకానికి తండ్రి వైఎస్సార్ పేరు పెట్టి ఆయనకు ఉన్న మంచి పేరును జగన్ చెడగొడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

 Dl Ravindra Reddy Makes Controversial Comments On Ycp Government-TeluguStop.com

ముఖ్యంగా అభయహస్తం పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు.జగనన్న పరిపాలన లో చదువులకు సంబంధించి “జగనన్న విద్యా దీవెన” వల్ల ఎన్నో పథకాలు నిర్వీర్యం అయ్యాయన్నారు.

పరిస్థితి ఇలా ఉంటే జగనన్న శాశ్వత సంపూర్ణ హక్కు రద్దు చేయాలని స్పష్టం చేశారు.అదే విధంగా ముఖ్యమంత్రి ఏది చెబితే దానికి అధికారులు కలవటం ఏమిటి అని ప్రశ్నించారు.

 Dl Ravindra Reddy Makes Controversial Comments On Ycp Government-వైసీపీ ప్రభుత్వంపై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన డీఎల్ రవీంద్రా రెడ్డి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరదల కారణంగా నష్టపోయిన బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, అన్ని రకాలుగా సహాయ పడాలని.డీఎల్ రవీంద్రా రెడ్డి సూచించారు.2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ కి మద్దతు తెలపడం జరిగింది.అనంతరం ఆయన మద్దతు ఉపసంహరించుకుని వైసీపీ ప్రభుత్వానికి గత కొద్ది కాలంగా.

వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు.దీంతో డి.

ఎల్.రవీంద్రారెడ్డి  చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

#Ravindra #Controversial #Jagan #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube