ట్రైలర్ తో అంచనాలు పెంచిన డీజే టిల్లు మూవీ.. సినిమా హిట్టా ఫట్టా?

ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే చాలు అందులో నటించిన హీరో హీరోయిన్ ల నుంచి తన ఆ తర్వాత సినిమాలు కూడా అదేవిధంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు.ఒక సినిమా హిట్ అయిందంటే చాలు.

 Dj Tillu Movie Now Became Talk Of The Industry, Dj Tillu, Neha Shetty, Siddu Jon-TeluguStop.com

ఆ తర్వాత సినిమాలపై కూడా అదేవిధంగా అంచనాలు ఉంటాయి.ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువగా హిట్ సినిమాలు ఇస్తే వారు అదే ఊపుతో దూసుకు పోతూ ఉంటారు.

అయితే అప్పుడప్పుడు కొత్త కొత్త హీరోలు కూడా వారు ఉన్నాము అంటూ గుర్తు చేస్తూ ఉంటారు.సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా టాలెంట్ ను నమ్ముకుని హీరోగా నిలదొక్కుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.

అలాంటి వారిలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒకరు.సిద్ధు జొన్నలగడ్డ ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు.అదేవిధంగా బుల్లితెర యాంకర్ రష్మీ తో కలసి గుంటూరు టాకీస్ సినిమా లో నటించాడు.ఆ తరువాత వచ్చిన కల్కి సినిమాలో మంచి పాత్ర చేశాడు సిద్దు.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ ప్రస్తుతం డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఈ సినిమాకోసం రైటర్ గా మారాడు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డీజే టిల్లు సాంగ్ మారు మోగిపోతోంది.

ఈ పాటను రామ్ మిరియాల పాడారు.ఈ సినిమాలో సిద్దు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొడుతోంది.ఇందులో సిద్దు సరసన హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది.ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటున్నాడు హీరో సిద్ధూ.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.అదేవిధంగా ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా ఫిబ్రవరి 11 న రవితేజ ఖిలాడీ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

రవితేజ కూడా వెనక్కి తగ్గేది లేదు అని అంటున్నాడు.మరి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన డీజే టిల్లు థియేటర్ లో కూడా అదే స్థాయిలో మోత మోగిస్తాడు లేదో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube