హీరోగా హిట్టు కొట్టి విలన్ గా ఎలా చేస్తాడు..!

అంతకుముందు ఎలా ఉన్నా సరే హీరోగా ఒక హిట్టు పడ్డాక అతను విలన్ గా ఎలా చేస్తాడు చెప్పండి.చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి విలన్ గా కూడా నటించిన సదరు నటుడు హీరోగా సూపర్ హిట్ కొట్టాక అతనికి వచ్చిన విలన్ ఛాన్సులు కూడా కాదని అంటున్నాడట.

 Dj Tillu Hero Reject Vilan Offer Tollywood-TeluguStop.com

ఇంతకీ ఎవరా హీరో అంటే డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ అని తెలుస్తుంది.హీరోగా తను చేసిన సినిమాలు అంతకుముందు పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయినా ఫైనల్ గా డీజే టిల్లుతో సత్తా చాటాడు.

హీరోగా డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టాక కూడా సిద్ధుకి విలన్ ఆఫర్లు వస్తున్నాయట.

ఈమధ్యనే ఓ సినిమాకు విలన్ ఛాన్స్ రాగా ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట.అంతేకాదు డీజే టిల్లు సీక్వల్ గా కూడా చర్చల్లో ఉందని తెలుస్తుంది.

ఇక మీదట డీజే టిల్లు హీరో విలన్ గా కాదు హీరోగానే కొనసాగించాలని చూస్తున్నాడు.హీరోగా హిట్టు కొట్టాక కూడా విలన్ గా చేయడం అన్నది కరెక్ట్ కాదన్నది మంచి విషయమే అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube