డీజే టిల్లు రాధిక ఎవరు భయ్యా.. వారిద్దరిలో ఎవరో క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

టాలీవుడ్ లో చిన్న సినిమా గా విడుదలై పెద్ద సక్సెస్ ని దక్కించుకున్న డీజే టిల్లు సీక్వెల్ రాబోతుంది.సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

 Dj Tillu 2 Movie Heroine News Goes Viral , Anupama Parameshwaran, Dj Tillu 2, Fi-TeluguStop.com

మొదటి పార్ట్‌ సినిమా లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.రాధిక పాత్ర లో ఆమె ఆకట్టుకుంది.

ఇప్పుడు రెండో పార్ట్ లో రాధిక పాత్ర కంటే ప్రధానంగా మరో హీరోయిన్‌ పాత్ర ఉండబోతుందట.అందుకే ఆ హీరోయిన్ పాత్ర కు గాను పలువురు హీరోయిన్స్ ని సంప్రదించారని పుకార్ల షికార్లు చేస్తున్నాయి.

 DJ Tillu 2 Movie Heroine News Goes Viral , Anupama Parameshwaran, DJ Tillu 2, Fi-TeluguStop.com

ఆ విషయం లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ప్రధానంగా అనుపమ పరమేశ్వరన్ మరియు శ్రీ లీల ల పేర్లు ప్రముఖం గా వినిపించాయి.

కానీ వారిద్దరిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.ఒక రోజు శ్రీలీలా హీరోయిన్ అంటూ వార్తలు వస్తుంటే మరో రోజు అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి డీజే టిల్లు సీక్వెల్ విషయం లో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది.ఈ సమయం లో హీరోయిన్ ఎవరు అనే విషయమై చెప్పకుండానే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు.

ఇటీవలే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అంటూ ఒక చిన్న పోస్టర్ ని కూడా హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ను కేవలం మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసే ఉద్దేశంతో సింధు జొన్నలగడ్డ చక చకా చిత్రీకరణ పనులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.డీజే టిల్లు మొదటి పార్ట్ కి సంబంధించి కథ ను కొనసాగిస్తూ సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అన్ని అనుకున్నట్టుగా జరిగితే కచ్చితంగా డీజే టిల్లు కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో డీజే టిల్లు సందడి చూస్తుంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంది.

యూత్‌ ఆడియన్స్ కి కనెక్ట్‌ అయితే ఏ స్తాయిలో సందడి ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube