ఆగస్టు నెలలోనే డీజే టిల్లు షూటింగ్ ప్రారంభం.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్?

ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది.ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యిందంటే చాలు కచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ రెడీ అవుతుంది.

 Dj Till Starts Shooting In August Producer Given By Clarity, Dj Tillu, Tollywood, Siddu Jonnalagadda, Sequel, August, Telugu Film Industry-TeluguStop.com

ఇలా ఎన్నో సీక్వెల్ సినిమాలు తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇటీవల విడుదలై హిట్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా షూటింగ్ కూడా తొందర్లోనే ప్రారంభం కానుంది.

అయితే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ‘డీజే టిల్లు‘ ఒకటి.ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు.

 Dj Till Starts Shooting In August Producer Given By Clarity, Dj Tillu, Tollywood, Siddu Jonnalagadda, Sequel, August, Telugu Film Industry-ఆగస్టు నెలలోనే డీజే టిల్లు షూటింగ్ ప్రారంభం.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా సమయంలోబ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన టాలీవుడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.ఈ సినిమా సిద్దు నటనతో పాటు సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా డీజే టిట్టు టైటిల్ సాంగ్ మోత మోగుతోంది.ఇప్పటికే ఈ ఈ సినిమా సీక్వెల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సీక్వెల్ కోసం ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అందువల్ల డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా మరొక సినిమా తెరకెక్కించాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు.

ఇక డీజే టిల్లు సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.అందువల్ల ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో డీజే టిల్లు పార్ట్ 2 కోసం ఇప్పటికే సినిమా యూనిట్ స్క్రిప్టు పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లు సమాచారం.ఇటీవల డీజే టిల్లు పార్ట్ 2 గురించి ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా అదిరిపోయే అనౌన్స్ చేశారు.‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ… రౌండ్ 2 కోసం సిద్ధమవుతోంది.ఆగస్ట్‌లో క్రేజీ అడ్వెంచర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.’ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.దీంతో ఆ ఫ్రాంచైజీ డీజే టిల్లునే అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube