డీజే - దువ్వాడ జగన్నాథం స్టోరి ఇదేనంట  

Dj – Duvvada Jagannatham Story Leaked-

మాస్ యాక్షన్ సినిమాలని బాగా హ్యాండిల్ చేస్తాడని హరీష్ శంకర్ కి పేరుంది.మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇదే విషయాన్ని నిరూపించాయి.

మరి అలాంటి మాస్ మార్క్ ఉన్న హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో ఓ పంతులు పాత్ర చేయించడం ఏమిటి అని మొదట అందరు ఆశ్చర్యపోయారు.కాని ఈ పంతులు పాత్రలో వేరే షేడ్ కూడా ఉంటుందని పోస్టర్స్ ద్వారా రివీల్ చేసారు హరీష్ శంకర్.

-

ఆ ఇంకో షేడ్ లో అల్లు అర్జున్‌ ఒక దొంగలా కనిపిస్తాడని టాక్.

డీజే స్టోరి లైన్ ఏమిటంటే, జగన్నాథం బయటి ప్రపంచానికి చాలా సాఫ్ట్ మనిషి.

ఒక మామూలు పంతులు ఎలా ఉంటాడో, తాను అలానే ఉంటాడు.తనని ఓ మోడ్రన్ అమ్మాయి ప్రేమిస్తుంది.ఇంటర్వల్ దాకా వీరిద్దరి మధ్య సరదా సన్నివేశాలతో సినిమా వినోదభరితంగా సాగుతుందట.ఇంటర్వల్ దగ్గరే అసలు ట్విస్టు బయటపడుతుంది.ఈ డీజే కేవలం పంతులు మాత్రమే కాదు, ఓ దొంగ.కాని మంచిదొంగ.రాబిన్ హుడ్ టైప్ లో ఉన్నోడిదగ్గర కొట్టేసి, లేనోడికి పంచే టైప్ అన్నమాట.సెకండాఫ్ మొత్తం దొంగతనాలు, యాక్షన్ సీన్స్ లో నింపేశాడట హరీష్.

అయితే ఈ స్టోరిలైన్ ఎంతవరకు నిజమో తెలియదు.డీజే స్టోరిలైన్ అంటూ ప్రచారంలో ఉన్న కథల్లో ఇది కూడా ఒకటి.

అల్లు అర్జున్ దొంగ కాదు, ఒక పోలీస్ ఇంఫార్మర్ అనే వార్తలు కూడా ఉన్నాయి.ఇక డీజే అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం జూన్ 23 దాకా ఆగాల్సిందే.

రంజాన్ మాసం కానుకగా అదేరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు

Dj – Duvvada Jagannatham Story Leaked- Related....