తెలుగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ్ హీరోయిన్..!

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా తెలుగులో నాగార్జున హీరోగా అహిసోర్‌ సాల్మన్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వైల్డ్ డాగ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రితం సీనియర్ స్టార్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన దియామీర్జా తాజాగా తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Diya Mirza Interesting Comments About Telugu Language-TeluguStop.com

స్విమ్మింగ్, సైకిల్ రైడింగ్ లాంటివి నేర్చుకున్న తరువాత మరిచిపోయే అవకాశం ఉంటుందని కానీ భాషను ఒకసారి నేర్చుకుంటే మరిచిపోలేమని ఆమె అన్నారు.

బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దియమీర్జా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగినా బాలీవుడ్ లో వరుస అవకాశాల వల్ల అక్కడ బిజీ కావడంతో ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

 Diya Mirza Interesting Comments About Telugu Language-తెలుగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ్ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా మీడియాతో మాట్లాడిన దియామీర్జా చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లే సమయంలో తాను తెలుగు నేర్చుకున్నానని.తనకు తెలుగు చదవడంతో పాటు రాయడం కూడా వచ్చని అన్నారు.

Telugu Childhood Memories, Dia Mirza, Telugu Language, Wild Dog Movie-Movie

రోజువారీ కార్యకలాపాల వల్ల తెలుగు మాట్లాడలేకపోవచ్చని.కానీ ఒకసారి మాట్లాడటం మొదలుపెడితే నేర్చుకున్న ప్రతి విషయం గుర్తుకు వస్తుందని అన్నారు.చిన్నప్పుడు పాఠశాలలో నేర్చుకున్న ఒక కవిత తనకు ఇప్పటికీ గుర్తుందని.ఆ కవిత చిన్నపిల్లలా తాను సినిమా సెట్స్ లో చెబుతుంటే అందరూ నవ్వుతున్నారని ఆమె అన్నారు.

వైల్డ్ డాగ్ సినిమా వల్ల తెలుగు భాషను పునఃశ్చరణ చేసుకునే అవకాశం దక్కిందని వెల్లడించారు.

యాక్షన్ కథతో వైల్డ్ డాగ్ సినిమా తెరకెక్కుతోందని.

సినిమాలో తాను ఎమోషనల్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని దియా తెలిపారు.తెలుగులో దియామీర్జా నటిస్తున్న తొలి సినిమా వైల్డ్ డాగ్ కావడం గమనార్హం.

దియామీర్జా తెలుగు భాష గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Wild Dog Movie #Dia Mirza

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు