ఈ దీపావళికి….పోస్ట్ కార్డ్ ఒకటి కొని ఇలా చేయండి..! ఎందుకో తెలుసా.?  

  • ఈ వార్త చదివిన వెంటనేపోస్ట్ ఆఫీస్ కు వెళ్లి…. ఓ 50 పైసల పోస్ట్ కార్డ్ ఒకటి కొనండి. All India Radio, Akashvani Bhavan, Parliament Street, New Delhi, 110001 టు అడ్రస్ కు ” Soldiers….We Are With You, Happy Diwali”అని రాసి పోస్ట్ బాక్స్ లో వేయండి. మీ ఈ ఒక్కమాట చాలు….దేశాన్ని రక్షించే 25 లక్షల మంది సైన్యం మీ విష్ తో ఫుల్ ఖుష్ అవ్వడానికి .! మీ ఈ ఒక్కమాట చాలు….ఎండ అనక, వాన అనక, సరిహద్దుల్లో దేశభద్రత కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఇచ్చే సైనికులలో స్పూర్తి నింపడానికి .! మీ ఈ ఒక్కమాట చాలు…పండగకు ఇంటికి పోలేకపోయానే, బంధువులను, స్నేహితులను మిస్ అయ్యానే అని బాధపడుతున్న ప్రతి సైనికుడి కళ్లలో ఆనంద భాష్పాల కోసం.! ఈ ఒక్కమాట చాలు….మేం ఒంటరి కాదుమా వెంట 127 కోట్ల జనాలు ఉన్నారని మన సైనికుడు గర్వంగా ప్రత్యర్థి గుండెలపైకి తుపాకీ ఎక్కుపెట్టడానికి! వరదలా వెల్లువెత్తే మన పోస్ట్ కార్డ్స్ సంఖ్య చాలు…కాలు దువ్వుతున్న పాక్ కామ్ గా అవ్వడానికి.!

  • Diwali Wishes For Soldiers  Message Indian Soldiers-

    Diwali Wishes For Soldiers, Diwali Message For Indian Soldiers

  • అవును….ప్రతి పండగా మనం మన బంధువులతో, స్నేహితులతో చేసుకుంటాం….కానీ ఈ పండుగను మాత్రం మనం మన దేశాన్ని రక్షించే సైనికులతో చేసుకుందాం… ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్టుమనమంతా సైనికుల వైపు నిలబడి వారి బలాన్ని పెంచుదాం. అందుకోసం ఓ 50 పైసల పోస్ట్ కార్డ్ ను పంపి, సందేశ్ టు సోల్డర్స్ లో మనవంతు బాధ్యత నెరవేరుద్దాం. FaceBook, WhatsApp లో ” Soldiers….We Are With You, Happy Diwali” అనే మెసేజ్ ను మారుమోగిద్దాం.

  • Diwali Wishes For Soldiers  Message Indian Soldiers-