బిగ్ బాస్ దివాళి స్పెషల్ ఎపిసోడ్..తారలు తరలి వచ్చిన వేళ..!

బిగ్ బాస్ తెలుగులో నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ సీజన్ ను గ్రాండ్ గా స్టార్ అయిన విషయం తెలిసిందే.ఇక అన్ని సీజన్స్ లాగానే ఈ సీజన్ లో కూడా గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

 Diwali Special Episode Of Bigg Boss Telugu 5 Details, Bigg Boss5, Bigg Boss 5 Te-TeluguStop.com

బిగ్ బాస్ పెట్టే చిచ్చుకి కంటెస్టెంట్స్ బలి అవుతున్నారు.వారం అంత టాస్కులు, గొడవలతో సాగిపోతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

ఇక వీకెండ్ లో నాగార్జున సందడి మాములుగా ఉండదు.శనివారం ఎపిసోడ్ లో ఆ వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ చెమటలు పట్టిస్తాడు.ఇక ఆదివారం ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఫన్ తో సాగుతూ చివరిలో ఎలిమినేషన్ తో బాధగా ముగుస్తారు.వీకెండ్స్ లో సెలెబ్రిటీలను తీసుకు వచ్చి రేటింగ్స్ ను మరింత పెంచుతారు.

ఇక ఈసారి కూడా దీపావళికి అదిరిపోయే ఎపిసోడ్ తో మన ముందుకు రాబోతున్నారు.

దీపావళి సెలెబ్రేషన్స్ ను ఈ ఆదివారం ఎపిసోడ్ లో చూపించ బోతున్నారు.

ఈ రోజు ఎపిసోడ్ ను సెలెబ్రిటీలతో నిమేసారు.

ఈ స్పెషల్ ఎపిసోడ్ తో ఈ షో రేటింగ్స్ మరొకసారి పెరగడం ఖాయం.దివాళి స్పెషల్ ఇంకా వీకెండ్ కూడా అవ్వడంతో ఈ ఎపిసోడ్ కోసం సెలెబ్రిటీలు తరలి వచ్చారు.ముందుగా హీరోయిన్ శ్రీయ ను తీసుకురాగా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు నాగార్జున.

వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా నటించడంతో వీరిద్దరికి మంచి స్నేహం ఉంది.

ఇక ఆ తర్వాత అవికాగోర్ డాన్స్ తో కుమ్మేసింది.ఇక పుష్పక విమానం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో షో కు విచ్చేసారు.ఆ తర్వాత సింగర్ కల్పనా ఎంట్రీ ఇచ్చి షణ్ముఖ్ మీద స్పెషల్ సాంగ్ పాడింది.

ఇక చివరగా యాంకర్ సుమ వచ్చి మరింత హుషారు తెచ్చింది.ఇక ఈ ప్రోమో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఎపిసోడ్ అదిరి పోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube