మాస్ రాజా కోసం తెగ కష్టపడుతున్న మజిలీ బ్యూటీ

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించేందుకు అందంతో పాటు అభినయానికి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఉంటుంది.ఇక కొందరు హీరోయిన్లకు ఈ రెండూ అంశాలు పుష్కలంగా ఉండటంతో వారు స్టార్ హీరోయిన్లుగా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తున్నారు.

 Divyansha Working Hard For Raviteja-TeluguStop.com

అయితే కొందరు మాత్రం హీరోయిన్‌గా తమ సత్తా చాటేందుకు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు.ఈ జాబితాలో మజిలీ చిత్రంలో నటించిన దివ్యాన్ష కూడా ఒకరు.

ఆమె అందానికి యువత ఏ విధంగా ఆకర్షితులయ్యారో మనకు తెలిసిందే.

మజిలీ చిత్రంలో ఆమె యాక్టింగ్‌కు కూడా ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.

అయితే ఆ తరువాత ఈ అమ్మడు మరో సినిమా చేయలేదు.దీంతో దివ్యాన్ష తిరిగి తెలుగు చిత్రాల్లో నటిస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు.

కానీ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ అమ్మడు ఓ భారీ ఆఫర్‌ను అందుకుంది.మాస్ రాజా రవితేజ నటించబోయే 68వ చిత్రంలో అమ్మడు హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది.

దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమా కోసం దివ్యాన్ష తీవ్రంగా కష్టపడుతోందట.

ఇప్పటికే తన పాత్రకు సంబంధించి పూర్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు తెలుగు భాషను నేర్చుకుంటుందట.

అంతేగాక అమ్మడు ఇటీవల యాక్టింగ్ కోర్సును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి ఎలాగైనా తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను వేసుకునేందుకు మజిలీ బ్యూటీ ప్రయత్నిస్తుంది.ఇక ఈ సినిమాను నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.

ఇక ఈ సినిమాలో రవితేజ యాక్షన్ కూడా మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.మరి రవితేజ చిత్రంతో దివ్యాన్ష ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube