నాగశౌర్యకి జోడీగా మజిలీ హీరోయిన్

యంగ్ హీరో నాగ శౌర్య గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ చేశాడు.

 Divyansha Kaushik Romance With Naga Shaurya, Police Vaari Hecharika Movie, Tolly-TeluguStop.com

మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు.మరో రెండు సినిమాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.

హోం బ్యానర్ లో శ్రీకృష్ణ సత్యభామ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.ఇందులో రాధికా శరత్ కుమార్ నాగ శౌర్యతల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ శౌర్య కెరియర్ లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా పోలీస్ వారి హెచ్చరిక.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాని కోనేరు మహేష్ నిర్మిస్తున్నారు.ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.కేపీ రాజేంద్ర ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగ శౌర్యకి జోడీగా దివ్యాంకా కౌశిక్ ని దర్శకుడు ఫైనల్ చేశాడు.ఈ భామ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జోడీగా నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.

చైతూ ప్రేమించే నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో దివ్యాంకా కౌశిక్ ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తుంది.ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సెకండ్ తెలుగు సినిమా విషయంలో ఈ భామకి చాలా గ్యాప్ వచ్చింది.

ఇప్పుడు నాగ శౌర్యకి జోడీగా రెండో తెలుగు సినిమాకి ఈ భామ సైన్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube