వరస విడాకులతో రచ్చ చేస్తున్న ధనుష్ ఫ్యామిలీ, రజినీకాంత్ ఫ్యామిలీ

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్ గా మారిపోయాయి.ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అన్యోన్య దంపతులుగా కొనసాగుతూ ప్రేక్షకుల మదిని గెలుచుకున్న వారు అనుకోని విధంగా విడాకులతో విడిపోతూ దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతూ ఉండటం గమనార్హం.

 Divorces In Danush And Rajinikanth Family , Danush, Rajinikanth, Rajinikanth Family, Selvaraghavan, Sonia Agarwal, Divorce-TeluguStop.com

కొన్ని నెలల నుంచి అన్ని ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోలు విడాకులతో విడిపోతున్నారు.ఇక ఇటీవల కోలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య, ధనుష్ పద్దెనిమిదేళ్ల దాంపత్య బంధానికి స్వస్థి పలికి విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి షాకిచ్చారు.

2004లో వీరి వివాహం జరుగగా ఇక నిన్న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు కుమారులు ఉన్నారు.

 Divorces In Danush And Rajinikanth Family , Danush, Rajinikanth, Rajinikanth Family, Selvaraghavan, Sonia Agarwal, Divorce-వరస విడాకులతో రచ్చ చేస్తున్న ధనుష్ ఫ్యామిలీ, రజినీకాంత్ ఫ్యామిలీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కేవలం ధనుష్ ఐశ్వర్య మాత్రమే కాదు అటు రజనీకాంత్ మరోవైపు ధనుష్ కుటుంబాలలో కూడా అంతకు ముందు విడాకులు తీసుకున్నవారు ఉన్నారు అన్నది తెలుస్తుంది.ధనుష్ అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సెల్వరాఘవన్.

ఆయన కూడా గతంలో విడాకులు తీసుకున్నారు.సెవెన్ జి బృందావన కాలనీ సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకున్నారు సెల్వరాఘవన్.

కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇక 2010లో సోనియాకు విడాకులు ఇచ్చారు.ఇక ఆ తర్వాత సంవత్సరంలోనే గీతాంజలి అనే యువతిని వివాహం చేసుకున్నారు సెల్వరాఘవన్.

కేవలం ధనుష్ కుటుంబం లోనే కాదు అటు ఐశ్వర్య కుటుంబం లో కూడా ఇలాంటి విడాకుల వ్యవహారం అంతకుముందే జరిగినట్లు తెలుస్తోంది.ఐశ్వర్య చెల్లెలు సౌందర్య కూడా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం గమనార్హం.ఇలా ధనుష్ అన్నయ్య.ఐశ్వర్య చెల్లెలు విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకున్నారు.కాగా ఇక ఇప్పుడు ఇటీవలే విడాకులతో విడిపోతున్నామంటూ ప్రకటించిన ఐశ్వర్య,ధనుష్ లు కూడా రానున్న రోజుల్లో మరో వివాహం చేసుకోబోతున్నారా అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుతుంది.ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి.

Divorces In Danush And Rajinikanth Family , Danush, Rajinikanth, Rajinikanth Family, Selvaraghavan, Sonia Agarwal, Divorce - Telugu Danush, Divorce, Rajinikanth, Selvaraghavan, Sonia Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube