విడాకులు పొందిన వారికి కూడా పెన్షన్ వర్తింపు : కేంద్రం

కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.కుటుంబ పింఛన్ కు సంబంధించి నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది.

 Women To Get Family Pension Even In Pendency Of Divorce, Center, Union Minister-TeluguStop.com

తల్లిదండ్రులు బతికున్న కాలంలో విడాకుల కోసం కుమారై దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో తల్లిదండ్రులకు పింఛన్ వస్తుందని కేంద్రం పేర్కొంది.ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి జీతేంద్ర సింగ్ ప్రకటించారు.

అయితే ఈ పింఛన్ పొందే వారి తల్లిదండ్రులు ఉద్యోగి లేదా పింఛన్ లబ్ధిదారులు మాత్రమే అర్హులని పేర్కొంది.

తల్లిదండ్రులు జీవించి ఉన్న కాలంలో అధికారికంగా భర్త నుంచి విడాకులు పొందిన కుమార్తెలు మాత్రమే పింఛన్ కు అర్హులు.

ఉద్యోగి లేదా సాధారణ పింఛన్ లబ్ధిదారుల అయి ఉండాలన్నారు.అప్పుడు ఆ కుమార్తె తల్లిదండ్రుల పింఛన్ ను పొందవచ్చు.కానీ ఈ నిబంధనలను సులభతరం చేసింది.ఇప్పుడు తల్లిదండ్రులు బతికి ఉండి కుమార్తె తన భర్తతో విడాకాలను అప్లై చేసుకుని విడాకులు పెండింగ్ లో ఉన్నా కుమార్తె పెన్షన్ కు అర్హత కలిగి ఉంటుందని సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు.

తల్లిదండ్రులు బతికున్న కాలంలో భర్త నుంచి అధికారికంగా విడాకులు మంజూరు కాకున్నా విడాకుల పిటిషన్ దాఖలు చేసి ఉంటే పెన్షన్ ని పొందవచ్చని మంత్రి తెలిపారు.తల్లిదండ్రుల మరణానికి ముందు దివ్యాంగులైన పిల్లలు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే వారికి కూడా కుటుంబ పెన్షన్ లభిస్తుందని ఆయన వెల్లడించారు.

తల్లిదండ్రుల చనిపోయిన తర్వాత వైకల్యం ఏర్పడితే ఈ కుటుంబ పెన్షన్ ను పొందడానికి కుమార్తెలు, కొడుకులకు అర్హత లేదన్నారు.అయితే దివ్యాంగులకు రూ.4,500, పెన్షనర్లకు రూ.6,700 అంటెండెంట్ అలవెన్స్ లభిస్తుందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube