భ‌ర్త బ‌రువు త‌గ్గాడ‌ని విడాకులు మంజూరు.. భార్య ఇచ్చిన ట్విస్టులు మామూలుగా లేవు..

ఈ మ‌ధ్య భార్య‌, భ‌ర్తలు చిన్ని చిన్న కార‌ణాల‌తోనే విడిపోతున్నారు.వారు చెప్పేవి విన‌డానికి కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి.

 Divorce Granted If Husband Loses Weight Twists Given By Wife Are Not Normal, Div-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి చిన్న కార‌ణంతోనే విడిపోయారు ఇద్ద‌రు భార్య‌భ‌ర్తుల‌.అయితే ఇందులో చాలా ర‌కాల ట్విస్టులు ఉన్నాయి.

పంజాబ్‌కు చెందిన‌టువంటి ఓ జంటకు 2012వ సంవ‌త్సంరంలో మ్యారేజ్ అయింది.కాగా వీరికి ఓ కూతురు కూడా ఉంది.

అయితే ఇందులో భ‌ర్త‌కు బ్యాంకు ఉద్యోగం ఉంది.ఇక త‌న భార్య ఏమో హిసార్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తోంది.

అయితే భ‌ర్త భార్య నుంచి విడాకులు కావాలంటూ అప్లై చేశాడు.

త‌న భార్య త‌ర‌చూ కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ ప‌డుతుంద‌ని, కాబ‌ట్టి ఆమెతో క‌లిసి జీవించ‌లేనని, ఆమె చాలా కోపిష్టి అని, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద‌ది చేసి గొడ‌వ‌లు ప‌డుతుంద‌ని ఆయ‌న వాపోయారు.

అయితే భ‌ర్త పిటిష‌న్‌పై పోరాడుతూ భార్య కూడా కోర్టు మెట్లు ఎక్కింది.తాను ఎలాంటి గొడ‌వ‌లు చేయ‌ట్లేద‌ని, భ‌ర్త కుటుంబ స‌భ్యులే త‌న‌ను వేధిస్తున్నారంటూ రివ‌ర్స్ కేసులు పెట్టింది.

ఇంకేముంది ఇలా చాలా రోజులుగా వీరి కేసులు విచార‌ణ సాగుతున్నాయి.కాగా దీనిపై లోతుగా విచార‌ణ సాగించిన ప్ర‌భుత్వం ఇప్పున‌డు విడాకులు మంజూరు చేసింది.

Telugu Kilos, Divorce, Bank Employee, Punjab-Latest News - Telugu

త‌న భార్య కార‌ణంగా 21 కిలోల బరువు తగ్గి ఇబ్బంది ప‌డుతున్నాన‌ని, తాను శారీరక వికలాంగుడిని అని భ‌ర్త నిరూపించ‌డంతో కోర్టు కూడా భార్య క్రూరంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని, భ‌ర్త కుటుంబంపై ఆ భార్య చేసిన అన్ని క్రిమినల్ ఫిర్యాదులు, కేసులు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, ఆమె కావాల‌నే వారిని ఇబ్బందులు పెడుతోంద‌ని గ్రహించిన కోర్టు చివ‌ర‌కు బాధితుడికి విడాకులు మంజూరు చేసింది.భార్య క్రూరత్వం వ‌ల్ల‌నే భ‌ర్త దాదాపుగా 21 కిలోలు త‌గ్గార‌ని ప‌రిగ‌ణించిన కోర్టు ఈ విధంగా ఆయ‌న‌కు విడాకులు మంజూరు చేసింది.ప్ర‌స్తుతం ఈ న్యూస్ వైర‌ల్ గా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube