60 ఏళ్ళ నుండి భార్య ముందు మూగవాడిగా నటించాడు .. చివరికి ఏమైందో తెలుసా !

అతడో గొప్ప నటనశాలి , ఆయన నటన ముందు ఆస్కార్ విజేతలు కూడా సాటిరారు , ఎందుకంటే సినిమాల్లో, టీవీల్లో నటించే వారు ఒక గంట లేకుంటే అరగంట నటిస్తారు.కానీ అమెరికాకు చెందిన వ్యక్తి ఏకంగా 62 ఏళ్ల నుండి నటిస్తూనే ఉన్నాడు.

 Divorce After 62 Years Of Fake Deafness To Avoid Listening To Wife-TeluguStop.com

అది కూడా భార్యకు తెలియకుండా ఉండటం కోసం తన నటనని 62 ఏళ్లు కొనసాగించాడు.ఇదెలా సాధ్యమో తెలీదు కానీ ఇంత గొప్పగా నటించినందుకు మాత్రం అతనికి ఆస్కార్ కన్నా గొప్ప అవార్డు ఏదైనా ఇవ్వవచ్చు.

భార్య చెప్పే మాటలు వినకుండా తప్పించుకోవడానికని మూగ,చెవిటి వాడిలాగా నటించాడు.అలా నటించే ఇన్నేళ్లు భార్యతో ఏ చీకూ చింత లేకుండా బ్రతికాడు.

పైగా భార్యకు కొంచెం కూడా అనుమానించలేదు.అంత జాగ్రత్తగా ఉన్నాడు.

అయితే నిజం ఎప్పుడూ దాగదు కదా! ఇన్నేళ్ల తర్వాత ఇపుడు బయటపడింది.దీంతో ఆమె అతనికి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది.

తన భార్యతో గొడవ పడలేక

అసలు విషయానికి వస్తే అమెరికాలోని వాటర్‌బ్యూరీకి చెందిన బ్యారీ డాసన్‌కు 84 ఏళ్లు.అతని భార్య డోరతీకి 80 ఏళ్లు.ఆమెతో గొడవ పడలేకనో మరే కారణమో తెలీదు కానీ, చాలా సంవత్సరాలు మాట్లాడకుండా ముగవాడిగానే కాపురం చేశాడు.అతన్ని ఇబ్బంది పెట్టలేక తన భార్య సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది.

భార్యా,భర్త మధ్య మాటలేవీ లేవు కాబట్టి ఇద్దరు సఖ్యంగా,ఎలాంటి గొడవలు లేకుండా గడిచింది.పైగా వీరికి ఆరుగురు పిల్లలు.13 మంది మనవళ్లు కూడా ఉన్నారు.వాళ్ల ఇంట్లోని వారు కూడా డాసన్‌ని మూగవాడనే భావించారు.

కానీ ఈ మధ్య ఒకసారి యూట్యూబ్ లైవ్‌లో ఆమె కంటికి దొరికిపోయాడు.అనుకోకుండా యూట్యూబ్ ఆన్‌చేసిన డోరతీకీ ఒక బారులో పాల్గొని పాట పాడుతున్న డాసన్ కనిపించాడు.

చారిటీ మీటింగ్ అని చెప్పి బారులో పాటలు పడుతున్న తన భర్త వీడియో ని చూసిన డోరతీ ఏకంగా తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

చివరికి డాసన్‌తో మాట్లాడేందుకు కొన్నేళ్లు కష్టపడి సైన్ లాంగ్వే నేర్చుకున్నాను.నేను సైగలు చేస్తే డాసన్‌కి అర్థమయ్యేది కాదు.అలాగే తనకు చూపు కూడా మందగించింది అని అతను చెప్పాడు , ఇపుడు అది కూడా నాటకమే అని తేలిపోయింది.అందుకే అతనితో విడాకులు తీసుకోవాలని ఆశిస్తున్నాను అని ఆమె భార్య అయిన డోరతీ తెలిపింది.62 ఏళ్ల పాటు అంత బాగా ఎలా నటించాడో తెలీదు కానీ సోషల్ మీడియాల్లో తెలిసిన నెటిజన్లు మాత్రం అతన్ని మగజాతి ఆణిముత్యం అని పోగిడేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube