అభి, అఖిల్ విష‌యం‌లో త‌ప్పు చేస్తున్నావ్‌.. మోనాల్‌పై దివి ఫైర్‌?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ఐదో వారం పూర్తి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే.ఇంటి స‌భ్యులంద‌రూ ఏ విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గ‌కుండా.హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు.ఇక ఈ వారం `మంచి నిప్పు.మధ్యలో ఓర్పు` టాస్క్‌లో గెలిచి సోహైల్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

 Divi Direct Question To Monal On Triangle Love Story!  Divi, Monal, Triangle Lov-TeluguStop.com

ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు భావోద్వేగం సంఘటనలు పంచుకోవ‌డం, అవినాష్ బిగ్ బాస్‌లా మారి కామెడీ చేయ‌డం, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇలా సంద‌డిగా సాగిపోయింది.

అయితే నిన్న‌టి ఎపిసోడ్‌లోనే మెనాల్‌, దివిల మ‌ధ్య ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

వాస్త‌వానికి బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.ఓవైపు అభిజిత్‌.మ‌రోవైపు అఖిల్ ఇద్ద‌రితోనూ ఉంటూ ఇంటి స‌భ్యుల‌కు, షో చూసే ప్రేక్ష‌కుల‌కు పిచ్చెక్కిస్తోంది.అయితే వీరి ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి విష‌యంలో మోనాల్‌పై దివి కాస్త ఫైర్ అయింది.

`మీ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో తెలీదు కానీ. అఖిల్‌, అభిజిత్‌లు ఎవ‌రికి వారు తానంటే మోనాల్‌కి ఇష్టం అని అనుకుంటున్నారు.మొన్న నామినేష‌న్స్ విష‌యం ప‌క్క‌న పెడితే.ముందు నుంచి ఇది ఉంది.

నువ్వు ఇద్ద‌రితోనూ ‌మాట్లాడి, ఇద్దరి మైండ్‌లో నువ్వంటే ఇష్టం అని క్రియేట్ చేయడం చాలా త‌ప్పు‌` అంటూ మోనాల్ చేసే మిస్టేక్‌ను మొహ‌మాటం లేకుండా బ‌య‌ట‌పెట్టేసింది దివి.

దీంతో నేను ఇద్దర్నీ లైక్ చేస్తున్నా.

కానీ నామినేష‌న్స్‌లో నా పేరుని వాడటం నాకు న‌చ్చ‌లేదు.అంతే త‌ప్ప మా మ‌ధ్య ఏం లేద‌ని.

చిన్న విష‌యాన్ని పెద్ద‌ది చేస్తున్నారంటూ మోనాల్ చెప్పుకొచ్చింది.ఇక ప‌క్క‌నే ఉన్న అమ్మా రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.

అఖిల్‌తో ఉంటే ఏం కాదు కానీ, అభిజిత్‌తో మాత్రం ఉండొద్ద‌ని.స్వాతి వచ్చిన తరువాత ట్రాక్ మారిందని మోనాల్‌కు ఉచిత స‌ల‌హాలు ఇచ్చాడు.

మొత్తానికి అభి, అఖిల్ విష‌యంలో మోనాల్ చేస్తున్న త‌ప్పును దివి బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టికీ.మోనాల్ మాత్రం తానేమి త‌ప్పు చేయ‌న‌ట్టు మాట్లాడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube