భార్యభర్తల విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు...!

భార్య భర్తలు తగాదాలు ఈ కాలంలో చాలా కామన్ అయ్యాయి.చిన్నపాటి వివాదాలకే కోర్టు మెట్లు తొక్కుతున్నారు.

 Madhya Pradesh High Courts Sensational Verdict In The Case Of Husband And Wife-TeluguStop.com

పోలీస్ స్టేషన్, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలంటూ గొడవలు పడుతున్నారు. ఆస్తి కోసం, వేధింపులతో కొందరు, వారిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేక మరికొందరు గొడవలు పడుతుంటారు.

తాజాగా ఓ మహిళ తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది.పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకొని రమ్మని, తండ్రి పేరుపై ఉన్న ఆస్తిని తీసుకురమ్మని వేధిస్తున్నాడని ఆరోపించింది.

ఇకపోతే విడాకులు కావాలని ఓ భార్య కోర్టును ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్ దిండోరీ జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాకి చెందిన ఓ వ్యక్తిపై జూన్ 19వ తారీఖున అతడి భార్య వరకట్న వేధింపుల విషయంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ఈ మేరకు విచారణకు పిలించింది హైకోర్టు.విచారణలో భార్య మాట్లాడుతూ.భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, రోజూ గొడవలు జరుగుతున్నాయని వాపోయింది.పెళ్లి జరిగినప్పటి నుంచి తన పుట్టింటి నుంచి ఐదు తులాల బంగారం, ఆస్తి కాగితాలు తీసుకొని రమ్మని వేధిస్తున్నాడని తెలిపింది.

తనతో కలిసి బతకలేనని ఆమె పేర్కొంది.భర్త మాట్లాడుతూ.

గొడవలు జరిగాయని… కానీ, అది డబ్బు విషయంలో జరగలేదన్నారు.ఇంట్లో చిన్న చిన్న విషయాల వల్ల తన భార్యను ఆమె కుటుంబ సభ్యులు పుట్టింటికి తీసుకెళ్లారని పేర్కొన్నాడు.

తన భార్యను ఇంటికి తీసుకురావడానికి అడిగినప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు రాలేదన్నారు.దీంతో పాటు వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ఈ మేరకు వాదనలు విన్న కోర్టు రాజీ లేదా సెటిల్ మెంట్ ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు అతడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అయితే కేసు విచారణలో భాగంగా వారిద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు ఆమె కు గాయాలు అయినట్లు పేర్కొంది.

అయితే, ఆమె వంటి పై చూస్తే మాత్రం ఎటువంటి గాయాలు అయినట్లు కనపడలేదు.ఒకవేళ ఈ విషయంలో భర్త జైలుకు వెళ్లాల్సి వస్తే… ఇకపై ఆ పెళ్లి ముగిసినట్లే అని, కాబట్టి ఇటువంటి వాటిని ఇంట్లోనే కూర్చొని రాజీ విధానం ద్వారా పరిష్కరించుకోవాలని జబల్పూర్ ప్రిన్సిపల్ బెంచ్ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube