Telangana student : చెదిరిన కల...అమెరికాలో తెలంగాణా విద్యార్ధి మృతి...!!

అమెరికా వెళ్లి చదువుకోవాలనే కల ఎంతో మందికి ఉంటుంది, ఆ కలను నిజం చేసుకోవడానికి ఉన్న ఊరును, కన్న తల్లి తండ్రులను, స్నేహితులను విడిచి సుదూరంగా కొన్నేళ్ళ పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉన్నా తమ తల్లి తండ్రుల కలను నిజం చేయడం కోసం, వారి కష్టాలను తీర్చడం కోసం ఎంతో మంది విద్యార్ధులు తప్పక పోయిన వలసలు వెళ్తుంటారు.అయితే అలా వెళ్ళిన విద్యార్ధి ప్రమాద వశాత్తు మృతి చెందితే ఆ కలలు చిద్రం అయినట్టే, తల్లి తండ్రులకు తీరని శోకం మిగిలినట్టే.

 Disturbed Dream Death Of Telangana Student In America , Telangana Student, Ameri-TeluguStop.com

ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.

తెలంగాణా రాష్ట్రం వికారాబాద్ లోని అపెక్స్ హాస్పటల్ యజమాని వెంకటప్ప , జ్యోతి ల రెండవ కుమారుడు శివదత్త అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు.

తండ్రి వైద్యుడు కావడంతో కొడుకుని కూడా వైద్యుడిగా చూడాలని అనుకున్నాడు.దాంతో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికా పంపాడు.అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మృత్యువు శివ దత్తను వెంటాడింది.గడిచిన ఏడాది జనవరి లోనే అమెరికా వెళ్ళినశివ దత్త అక్కడ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ వర్సిటీలో ఏంఎస్ చేస్తున్నాడు.అతడితో పాటు మరొక స్నేహితుడు కూడా ఉంటున్నాడు కాగా,

Telugu America, Apex, India, Jyoti, Missouri, Saint Louis, Shiva Datta, Telangan

శివదత్త అతడి స్నేహితుడు కలిసి శనివారం రోజున స్థానికంగా ఉన్న ఓ సరస్సు వద్దకు వెళ్లారు.ఇద్దరూ సరస్సు లోకి దిగగా ప్రమాద వశాత్తు ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి గాలించగా శివదత్త మృత దేహం మాత్రమే కనిపించింది.దాంతో వెలికి తీసి అతడి వద్దనున్న ఆధార ప్రకారం తల్లి తండ్రులకు సమాచారం అందించారు.

కాగా అతడి మరొక స్నేహితుడి మృత దేహం మాత్రం ఇంకా బయటపడలేదు.ఈ విషయం తెలుసుకున్న శివ దత్త తల్లి తండ్రులు కుప్ప కూలిపోయారు. డాక్టర్ గా ఇంటికి వస్తాడనుకున్న తమ కొడకు ఇలా శవంగా మారుతాడని అనుకోలేదంటూ రోదిస్తున్నారు.ఇదిలాఉంటే శివదత్త మృత దేహన్ని తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని తెలియడంతో మృత దేహాన్ని త్వరగా తీసుకువచ్చే ఏర్పాట్లు చేయమంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube