ఏపీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టిస్తున్న ఆ జిల్లా..!!

రాష్ట్రంలో మొదటిసారి వచ్చిన కరోనా అదేరీతిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో నమోదయింది.ఊహించని రీతిలో కేసులు పెరిగిపోవడంతో తూర్పు గోదావరి జిల్లా విషయంలో వైరస్ కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే.

 District That Is Putting Tension On The Ap Government-TeluguStop.com

ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇటీవల తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ ఒక్కసారిగా కేసులు పెరగటం ప్రభుత్వానికి టెన్షన్ పెట్టిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా పి.

 District That Is Putting Tension On The Ap Government-ఏపీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టిస్తున్న ఆ జిల్లా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గన్నవరం లో కేసులు భారీగా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై అక్కడ కర్ఫ్యూను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధించడం జరిగింది.నేటి నుండి ఈ కర్ఫ్యూ సమయం జిల్లాలో అమలులోకి రానుంది.

పాజిటివ్ రేటు మళ్లీ పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.మరోపక్క కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాలలో కంటోన్మెంట్ జోన్లను ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.

ఏది ఏమైనా జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతూ ఉండడంతో తూర్పుగోదావరి వాసులు కూడా భయాందోళనలు చెందుతున్నారు.

#COVID-19 #Andhra Pradesh #East Godavari #Rises Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు