ఆ కలెక్టర్ ఎప్పుడు ఏ స్కూల్ కి వస్తారో తెలియక యాజమాన్యాలు భయపడుతున్నాయి.! హ్యాట్సాఫ్ సార్.!

కేరళ రాష్ట్రం అల్లపుజా జిల్లా.కలెక్టర్ ఎస్.సుహాస్.2012 IAS బ్యాచ్ కు చెందిన ఈయన ఇటీవలే అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.రాగానే జిల్లాలోని పాఠశాల్లో బోధన, సౌకర్యాలపై దృష్టి పెట్టారు.జూన్ 20వ తేదీ మధ్యాహ్నం నీరుకున్నమ్ లోని శ్రీ దేవి విల్సమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు వెళ్లారు.

 District Collector In Kerala Shares Meal With Students Wins Hearts-TeluguStop.com

సరిగ్గా పిల్లలు భోజనం చేసే సమయంలో.కలెక్టర్ వచ్చారని అందరూ హడావిడి చేస్తుంటే.ఆయన నేరుగా డైనింగ్ హాలులోకి వెళ్లారు.ఓ ప్లేట్ తీసుకున్నారు.

పిల్లల మధ్య కూర్చుని భోజనం చేశారు.ఆ రోజు కర్రీస్ దోసకాయ, ఆలుగడ్డ.

పెరుగు కూడా ఉంది.పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.

అక్కడితో ఆపలేదు…అంతకు ముందు ఆయన వయనాడ్ జిల్లా కలెక్టర్ గా కూడా పని చేశారు.అప్పుడు కూడా ఇలాగే గిరిజన పాఠశాలలపై దృష్టి పెట్టారు.ప్రతి రోజు ఓ గిరిజన పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చేవారు.దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజన స్కూల్స్ విద్యార్థుల సంఖ్య అనూహస్యంగా పరిగింది.

ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్ చేరారు.జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఈ మార్పు తీసుకొచ్చారు అక్కడ.

అక్కడి నుంచి ఇటీవలే అల్లపుజ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు కలెక్టర్ సుహాన్.దీని వల్ల మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరుగుతుందని.

విద్యార్థుల ఆరోగ్యంపైనే కాకుండా చదువుపై కూడా దృష్టి పెట్టటానికి వీలవుతుంది అన్నారు.

పిల్లల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పుడుతుందన్నారు.

అతి సామాన్యుడిగా.ఓ పేరంట్ గా వారితో కూర్చుని భోజనం చేయటం వల్ల పిల్లల్లోనూ భరోసా, ధీమా, దైర్యం వస్తుందన్నారు.

ప్రస్తుతం ఈ కలెక్టర్ ఎప్పుడు ఏ స్కూల్ కి వెళ్తారో తెలియక యాజమాన్యాలు హడలిపోతున్నాయి అంట.ఎప్పుడు ఏ స్కూల్ కు వచ్చి భోజనం చేస్తారో అనే భయంతో.అన్ని స్కూల్స్ లోనూ మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరిగిందంటున్నారు ఉపాధ్యాయులు.మార్పు మంచికే అంటున్నారు.హ్యాట్సాఫ్ కలెక్టర్ గారూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube