ఛార్మికి ఆస్కార్ అవార్డు రావాలి.. డిస్ట్రిబ్యూటర్ శ్రీను షాకింగ్ కామెంట్స్?

Distributor Srinu On Charmi Kaur In Romantic Movie Pre Release Event

సాధారణంగా ఒక సినిమాకు సంబంధించిన ఏదైనా వేడుక జరిగితే ఆ వేడుకలో చిత్ర బృందం మాట్లాడుతూ ఎన్నో కామెంట్ చేస్తుంటారు.అయితే ఇలా చిత్రబృందం గురించి కాబట్టి మాట్లాడతారో లేకపోతే నిజంగానే వారిపై ఉన్న అభిమానంతో ఇలా మాట్లాడతారో తెలియదు కానీ కొన్నిసార్లు వేదికపై మాట్లాడే మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

 Distributor Srinu On Charmi Kaur In Romantic Movie Pre Release Event-TeluguStop.com

తాజాగా ఇలాంటి వ్యాఖ్యలను డిస్ట్రిబ్యూటర్ శీను మాట్లాడటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

డిస్ట్రిబ్యూటర్ శీను రవితేజ క్రాక్ సినిమా విషయంలో ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్య గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 Distributor Srinu On Charmi Kaur In Romantic Movie Pre Release Event-ఛార్మికి ఆస్కార్ అవార్డు రావాలి.. డిస్ట్రిబ్యూటర్ శ్రీను షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పట్లో వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే పూరి బ్యానర్ లో పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించినటువంటి “రొమాంటిక్” చిత్రం ఈనెల 29వ తేదీన విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు.

ఈ వేదికపై డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతూ పూరి ఛార్మిల పై ప్రశంసలు కురిపించారు.

Telugu Akash Puri, Charmy Kaur, Dil Raju, Director Puri Jagannath, Distributor Srinu, Liger Movie, Oscar Award, Pre Release Event, Romantic Movie, Tollywood, Vijay Devarakonda-Movie

సినిమా ఇండస్ట్రీ తనకు ఒక కుటుంబం వంటిదని, పూరి, చార్మి తన కుటుంబసభ్యులు అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.ఇక చార్మి నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుందని లైగర్ సినిమాకు ఈమెకు ఏకంగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఛార్మి గురించి షాకింగ్ కామెంట్ చేశారు.డిస్ట్రిబ్యూటర్ శీను మాట్లాడిన మాటలు కొంత వరకు నవ్వు తెప్పిస్తున్నపట్టికి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

రొమాంటిక్ సినిమాలో పూరి కొడుకు ఆకాష్ హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

#Dil Raju #Pre #Akash Puri #Srinu #Puri Jagannath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube