వికటించిన హోమియో వైద్యం.. పలువురి ప్రాణాలు తీసింది.. !

మనిషిలో ఉన్న భయం మనస్సును పరిపరి విధాలుగా పరిగెత్తేలా చేస్తుంది.దీని ఫలితంగా మనిషి విచక్షన కోల్పోయి తన ఆలోచనల పరిధిని దాటి ప్రవర్తిస్తాడు.

 Distorted Homeopathic Medicine Took 8 Lives In Chattisgarh-TeluguStop.com

అందులో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వారి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.

ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు.

 Distorted Homeopathic Medicine Took 8 Lives In Chattisgarh-వికటించిన హోమియో వైద్యం.. పలువురి ప్రాణాలు తీసింది.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాస్త కరోనా అని అనుమానం కలగగానే ప్రతి వారి మాట వింటూ అనవసరం అయిన మందులను కూడా వాడుతున్నాడు.ఇందువల్ల ప్రాణాలను అపాయంలో పడవేస్తున్నాడు.ఇకపోతే ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్ లోని కోర్మీ గ్రామంలో కరోనా వచ్చిందనే భయంతో 12 మంది సభ్యులున్న కుటుంబం ఆల్కహాలిక్ హోమియోపతి మందును తీసుకొనగా అది వికటించడంతో 8 మంది మృత్యువాతపడగా, మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

అయితే వీరు కరోనా వల్ల చనిపోయారని భావించిన గ్రామస్తులు పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అంత్యక్రియలు జరిపారు.

తర్వాత మరో ముగ్గురు కూడా ఇలాగే చనిపోవడంతో పోలీసులకు సమాచారం అందింది.వారు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

#8 Died #Kormi #Distorted #Corona Fear #Covid Effect

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు