ఆదిలోనే హంసపాదా ? ఏంటి షర్మిలమ్మా ?

ఎన్నో అంచనాలతో, ఆశలతో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల దానికంటే ముందుగా తెలంగాణలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ,  సమస్యలను హైలెట్ చేస్తున్నారు.

 Dissident Leaders Are Growing In Harmilas Party Ys Sharmila, Telangana, Jagan, K-TeluguStop.com

బాధితులను పరామర్శిస్తు ఓడర్పులు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ అంతటా ప్రభావం చూపించి రాబోయే ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాల్లో సంపాదించే విధంగా అడుగులు వేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో ఆమె ప్రయత్నం చేస్తున్నారు.తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం తెలంగాణలో ఎక్కువగా ఉందని ఆయన అభిమానులు తనకు అండగా నిలబడతారని , దీనికితోడు రెడ్డి సామాజికవర్గం అండదండలు ఉంటాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.

పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఆమె అంతకంటే ముందుగానే పార్టీలో పదవులను కేటాయిస్తున్నారు.అయితే ఇక్కడే అసంతృప్తులు బయలుదేరారు.తమకు సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదని , తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి అప్పుడే షర్మిల పార్టీ అభిమానుల్లో నెలకొంది. జూలై 8 వ తేదీన షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

అంతకంటే ముందుగానే పార్టీ సంస్థాగతంగా నియమించేందుకు హడక్ కమిటీలను ఆమె నియమించారు.పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్టీలో మరిన్ని పదవులు భర్తీ చేపడతాం అంటూ షర్మిల గొప్పగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు హడక్ కమిటీ కి ఒక్కొక్కరూ రాజీనామా చేస్తుండడం తో షర్మిల పార్టీలో కలవరం మొదలైంది.

Telugu Devarakabadra, Hadak Committee, Jagan, Sharmila Odarpu, Sharmila, Telanga

మహబూబ్ నగర్ జిల్లా లో అసలైన వైయస్సార్ అభిమానులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు అంటూ దేవరకద్రకు చెందిన కేటీ రెడ్డి హాడక్ కమిటీకి రాజీనామా చేశారు.ఇంకా అనేకమంది పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారు అనుకుంటున్న నాయకులు సైతం అప్పుడే తీవ్ర అసంతృప్తితో ఉంటూ,  షర్మిల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.మొదట్లో తెలంగాణ అంతటా తీవ్ర ప్రభావం చూపించే అంత స్థాయిలో హడావుడి చేసినా, ఆ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఆశించినంత స్థాయిలో ఉండదు అనే అభిప్రాయం అప్పుడే నాయకుల్లో మొదలవ్వడం షర్మిలకూ ఆందోళన పెంచుతోందట.

పార్టీ పేరుని, మ్యానిఫెస్టో ని ప్రకటించిన తరువాత , ఆ పార్టీ విధి విధానాలపై నాయకులకు, ఆ పార్టీలో చేరాలని చూస్తున్న వారికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube