ఆ ఏపీ మంత్రిపై అస‌మ్మ‌తి మొద‌లైందే...!

వైసీపీలోకి కీల‌క మంత్రిపై అధికారులు గుస్సాగా ఉన్నారా ? మ‌ంత్రి చ‌ర్య‌ల‌తో తాము ఇబ్బంది ప‌డుతున్నామ‌ని చెబుతున్నారా ? అంటే.ఔన‌నే అంటున్నాయి.

 Dissent Against The Ap Minister Has Already Begun,ap,ap Political News,latest Ne-TeluguStop.com

స‌చివాల‌య వ‌ర్గాలు.విష‌యంలోకి వెళ్తే రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్న వెలంప‌ల్లి శ్రీనివాస‌రావుకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ‌గా ఉన్నాయి.

ముఖ్యంగా రోజూ ఏదో ఒక చోట జ‌రుగుతున్న అప‌చారం.లేదా దేవాల‌యాల‌పై దాడులు.

విగ్ర‌హాల ధ్వంసం వంటివి.బీజేపీకి రాజ‌కీయ వ‌న‌రుగా మారాయి.

దీంతో ఆయ‌న త‌న శాఖ‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక పోతున్న‌విష‌యం తెలిసిందే.

అంత‌ర్వేది ర‌థం ఘ‌ట‌న‌, విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ర‌థం వెండి సింహాలు మాయం కావ‌డం వంటివి ప్ర‌ధానంగా ఇరుకున పెట్టాయి.

ఇక‌, నిత్యం ఎక్క‌డో ఒక‌చోట‌.విగ్ర‌హాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి.

దీంతో వెలంప‌ల్లి వీటికి స‌మాధానం చెప్పుకోవ‌డం ఇబ్బందిగా మారింది.దీంతో ఆయ‌న త‌న శాఖ‌పై ఈ ప్ర‌తాపం అంతా చూపిస్తున్నార‌ని అధికారులు ప‌రోక్షంగా ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా కీల‌క అధికారిని రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌కు పంపి.ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అధికారులు ఇప్పుడు ఈ ప‌నిచేయాలా? లేక మా ప‌నిచేసుకోవాలా? అని త‌లలు ప‌ట్టుకున్నారు.

పైగా ఈ విష‌యాల‌న్నీ రాజ‌కీయాల‌కు ముడిప‌డి ఉండ‌డంతో తాము ఎలాంటి నివేదిక‌లు ఇచ్చినా.

ఇబ్బందుల‌లో ప‌డ‌డం ఖాయ‌మ‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.దీంతో కొంద‌రు ఆఫ్ ది రికార్డుగా.

ఈ త‌ల‌నొప్పి మాకెందుకు, ఏదైనా ఉంటే.మంత్రి స్వ‌యంగా చూసుకోవాలి కానీ! అని వ్యాఖ్యానిస్తు న్నారు.

మ‌రికొంద‌రు.సెలవుపై వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీంతో దేవ‌దాయ శాఖ‌లో ఒక‌విధ‌మైన గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని అంటున్నారు.ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో ఈవోల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంద‌ని చెబుతున్నారు.

మ‌రి మంత్రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube