ఒకరిపై ఒకరికి అసంతృప్తి నిజమేనా ? 

జగన్ కు అత్యంత సన్నిహితమైన రాజకీయ మిత్రుడుగా గుర్తింపు గుర్తింపు పొందిన మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పార్టీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.జగన్ పైన, ఏపీ ప్రభుత్వం పైన, పార్టీ పైన ఎవరు విమర్శలు చేసినా కొడాలి నాని ఘాటుగానే స్పందిస్తూ ఉంటారు.

 Dissatisfaction With Each Other Is True Jagan,ap Cm Jagan, Ysrcp, Ap Gudivada, G-TeluguStop.com

జగన్ విషయంలో విమర్శలు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను అంటూ బహిరంగంగానే హెచ్చరికలు చేస్తూ ఉంటారు.ఇక టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ , టిడిపి ఇతర నాయకులను విమర్శించేందుకు కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత కొడాలి నాని గతంలో మాదిరిగా స్పందించడం లేదు.

         సైలెంట్ గా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు.

అయితే మంత్రి పదవి పోయిందన్న బాధతోనే కొడాలి నాని ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే.? ఆ మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందని ముందుగానే జగన్ ప్రకటించడం, నానికి కూడా దీనిపై సరైన క్లారిటీ ఉండడంతో ఈ విషయంలో అసంతృప్తి ఏమీ లేదు అన్నట్లుగానే నాని వర్గీయులు చెబుతున్నారు.కానీ ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయడంపై నాని అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ సొంత గ్రామం ఉన్న గుడివాడ నియోజకవర్గం లో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉంటారు.

కానీ ఎన్టీఆర్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా 2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానులు తనకు దూరమవుతారని, సామాజిక వర్గం తోను అనే ఇబ్బందులు ఏర్పడతాయని నాని ఆందోళన చెందుతున్నారట.
     

  అందుకే పేరు మార్పు విషయమై ఇప్పటివరకు ఆయన తన స్పందన తెలియజేయలేదు.జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే ఛాన్స్ బహిరంగంగా చేయకపోయినా ఈ విషయంలో మాత్రం ఇతర వైసిపి నాయకులు మాదిరిగానే నాని కూడా అసంతృప్తితో ఉన్నా.దానిని ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఇక నాని విషయంలో జగన్ సైతం అసంతృప్తి గానే ఉన్నట్లు సమాచారం.గతంలో మాదిరిగా ఆయన యాక్టివ్ గా ఉండకపోవడం, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి దూరంగా ఉండడం , గతంలో ఉన్నంత పొలిటికల్ యాక్టివ్ ఇప్పుడు కనిపించకపోవడం ఇవన్నీ కొడాలి నాని జగన్ కు మధ్య దూరం పెంచుతున్నాయట.

ఒకరకంగా చెప్పాలంటే ఒకరిపై ఒకరికి అసంతృప్తి ఉన్నా, అదెక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube