టీఆర్ఎస్ లో మొదలైన అసంతృప్తులు... దేనికి సంకేతం?

టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా మొదలై అందరినీ ఏకం చేసి ఒక్కతాటి పైకి తీసుకొచ్చి తెలంగాణను సాధించారు.అయితే టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడిన నాటి నుండి ఎంతో మంది ఉద్యమంలో కాని పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు ఎంత మందో ఉన్నారు.

 Dissatisfaction That Started In Trs A Sign Of What, Kcr, Trs Party-TeluguStop.com

కాని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎవరైతే ఉద్యమం చేసిన వారున్నారో, వారిని పక్కకు బెట్టి ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారికి అత్యున్నత పదవులు దక్కాయని ప్రతి ఉద్యమకారుడి మనసులో రగులుతూ ఉంటుంది.కాని పైకి చెప్పడానికి సాహసించరు.

అయితే తాజాగా మహిళా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన ఓ సమావేశంలో ఓ మహిళా టీఆర్ఎస్ మహిళా కార్యకర్త మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉండగానే తన ఆవేదనను వెళ్ళగక్కింది.

2001 నుండి పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డామని, అయితే ఇప్పుడు మా లాంటి వాళ్లకు 20 ఏళ్ల నుండి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని, కాని ఒకే ఇంట్లో ముగ్గురికి పదవులు లభించాయని, ఇది ఎంతవరకు సమంజసమని సదరు మహిళా టీఆర్ఎస్ కార్యకర్త ఆవేదనను వెళ్ళిబుచ్చారు.

అయితే ఇలా బహిరంగంగా టీఆర్ఎస్ నేతలు వెళ్ళిబుచ్చుతుండడం టీఆర్ఎస్ పార్టీకి చేటు చేసేదిగానే చెప్పవచ్చు.ఏది ఏమైనా సమీకరణాల పేరుతో అసలు సిసలు ఉద్యమకారులకు అన్యాయం జరిగింది.

కేసీఆర్ ఇలా అసంతృప్తులపై దృష్టి సారించకపోతే, క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది.కేసీఆర్ కూడా పార్టీపై కాకుండా ప్రభుత్వంపై దృష్టి పెడితే చంద్రబాబు లాంటి పరిస్థితి కేసీఆర్ కు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube