తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైన నేపథ్యంలో మరోసారి నేతల నుంచి అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి.టికెట్ రాని నేతలు బరిలో ఉంటామని చెబుతున్నారు.
తాజాగా విడుదలైన తుది జాబితాలో సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థిగా దామోదర్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.అయితే సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్ రెడ్డి బోరున విలపించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించాలన్న ఉద్దేశంతో తనను కాదని దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే సూర్యాపేట ప్రజల మద్ధతు తనకే ఉందన్న పటేల్ రమేశ్ రెడ్డి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
.