ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం.. మరికొన్ని రోజులు ఇవే ఇబ్బందులు..

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.ఇన్‌స్టా యాప్ ఇప్పుడు చాలా దేశాల్లో ఓపెన్ కావడం లేదు.

 Disruption In Instagram Services ,instagram Account, Tecnical Issues, Some Days,-TeluguStop.com

దీంతో యూజర్లు చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. యాప్ స్టోరీస్ సైతం వీక్షించలేకపోతున్నారు.

ఈ సమస్య భారతీయ యూజర్లను కూడా ఇబ్బంది పెడుతోంది.నిన్న అంటే జులై 15 తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఆగిపోయాయి.

మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల వరకు సేవలు అందుబాటులోకి రాలేదు.ఇందుకు కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ కావడమేనని తెలుస్తోంది.

డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న అనగా శుక్రవారం 61% యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ ఓపెన్ కాలేదు.మరో 26% శాతం మంది యూజర్లకు లాగిన్‌ అవ్వడం కుదరలేదు.

దీనికి ప్రధాన కారణం సర్వర్ కనెక్షన్‌ సమస్యలేనని డౌన్‌డిటెక్టర్ పేర్కొంది.యూఎస్‌లో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో 24,000 మంది ఇన్‌స్టా వినియోగదారులకు యాప్ ఓపెన్ కాలేదని డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.

యూజర్లు వేల కొద్ది ఫిర్యాదులు చేస్తున్నా ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Telugu Servers, Days, Ups, Tecnical-Latest News - Telugu

కొన్ని గంటల తర్వాత మెటా ప్రతినిధి ఒక టెక్ సంస్థకు ఈమెయిల్ పంపారు.“చాలా మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ని యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలిసింది.మేం సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.

యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం,” అని పేర్కొన్నారు.కాగా ఇప్పటికీ ఈ సేవలు రిస్టోర్ అయ్యాయో లేదో తెలియలేదు.

నిన్న రాత్రి కూడా డెస్క్‌టాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ సరిగ్గా పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేశారు.వారు ఇన్‌స్టాగ్రామ్ డెస్క్‌టాప్‌లో పోస్ట్‌లను చెక్ చేయలేకపోతున్నామని #ఇన్‌స్టాగ్రామడౌన్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.

అయితే టెక్ రిపోర్ట్స్‌ ప్రకారం యూజర్లకు ఇంకొన్ని రోజులు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube