గొడవ పడిన అగ్రహీరోలు

వారిద్దరూ ప్రాణ స్నేహితులు, రెండు దశాబ్దాల స్నేహం.బాక్సాఫీస్ రికార్డులు, అభిమానుల గొడవల .

 Disputes Between Aamir And Salman-TeluguStop.com

ఇవేమీ వారిద్దరిని వేరు చేయలేదు.ఇద్దరు కలిసి షారుఖ్ తో శత్రుత్వాన్ని పంచుకున్నారు కాని వారిద్దరూ మాత్రం ఎప్పుడు గొడవపడింది లేదు.

ఎంత ప్రేమ లేకపోతే ఆమీర్ ఖాన్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు సల్మాన్.సల్మాన్ పై అంతే ప్రేమ ఉంటేనే కదా .సల్మాన్ ప్రతి సినిమాను ప్రమోట్ చేస్తాడు అమీర్.

అయితే ప్రాణస్నేహితులు కుడా ఇప్పుడు గొడవపడ్డారు.

కారణాలు ఏంటో బయటకి రాలేదు కాని, ఇటివలే అమీర్ ఇంటికి వెళ్ళాడట సల్మాన్.దేని గురించి మొదలైందో మాట, గొడవ దాకా వెళ్ళింది మ్యాటర్.

సల్మాన్ ఏడుస్తూ ” నేను నీ అంత కష్టపడే వ్యక్తిని కాకపోవచ్చు, కాని నాకు ఉండాల్సింది నాకు ఉంది ” అనేంత దూరం వెళ్లిందట.

ప్రాణ స్నేహితుడు అలా వెళ్లిపోతోంటే అమీర్ కుడా ఏడ్చేసాడట.

ఇది నిజమా అబద్ధమా అని అనుకునేంత లోపే ఒక టీవీ చానెల్ తో ఆమీర్ భార్య కిరణ్ రావు మాట్లాడుతూ ” ఇదంతా జరిగినప్పుడు నేను వాళ్ళతో లేను, వారిమధ్య నేను దూరలనుకోవట్లేదు, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఎంత ఇష్టమో నేను చెప్పాల్సిన పని లేదు.వారి సమస్యలను వారే తీర్చుకునేంత జ్ఞానం, మానసిక స్థైర్యం ఇద్దరికీ ఉన్నాయి ” అంటూ గొడవ నిజంగానే జరిగిందని చెప్పేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube