టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను( Ramana Deekshitulu ) విధుల నుంచి తొలగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
అయితే సీఎం జగన్ ( CM Jagan )తో పాటు టీటీడీ ఛైర్మన్( TTD Chairman ), అధికారులు, పాలకమండలి, జియ్యంగార్లు మరియు ఆలయ వ్యవస్థపై రమణ దీక్షితులు తీవ్ర విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే రమణ దీక్షితులు చేసిన విమర్శలపై టీటీడీ పాలకమండలి చర్యలు తీసుకుంది.ఇందులో భాగంగా ఆయనను గౌరవ ప్రధాన అర్చక విధుల నుంచి తొలగించింది.