జల వివాదం లో డిష్యుం డిష్యుం..కేసీఆర్ వర్సెస్ జగన్.. నాడు దోస్తి.. నేడు కుస్తీ

2019 ఎన్నికల ముందు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అన్యోన్యంగా ఉండడం అందరికీ విధితమే.కానీ ఈనాడు రెండు రాష్ట్రాల జల వివాదం తో, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రమైన వ్యాఖ్యలతో వాగ్వాదం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం.

 Dishum Dishum Kcr Vs Jagan In Water Dispute  Water Issue, Jagan,kcr, Gajendra Si-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఈరోజు వాడి వేడి చర్చ జరిగింది.ఈరోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహించగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి అందులో పాల్గొన్నారు.

సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గట్టిగా వాదించు కొన్నట్లు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవు అని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, జగన్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కు అసలు అనుమతులు లేవు అని సీఎం కేసీఆర్ కౌన్సిల్ లో మండిపడ్డారు.మొదటి ప్రాజెక్ట్ కే అనుమతి లేకపోతే రెండో ప్రాజెక్టు ఎలా చేపడతారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇరు ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం జరుగుతుండగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలుగజేసుకొని సర్ది చెప్పినట్లు తెలిసింది.ఇరు రాష్ట్రాల వారు ప్రాజెక్టులకు సంబంధించి డి పి ఆర్ లు కేంద్రానికి సమర్పిస్తే, కేంద్రం అన్ని ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకొని పరిష్కరిస్తుందని సమావేశంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Telugu Gajendrasingh, Jagan, Krmb, Supreme-Latest News - Telugu

కానీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియా సమావేశం పెట్టి సమావేశంలో చర్చించిన విషయాలు వెల్లడించారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం జరిగినట్లు మాత్రం చెప్పలేదు. కె ఆర్ ఎమ్ బి బోర్డ్ తరలించడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలియజేశారు.రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణం పై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ విధానం, గోదావరి జలాలను సమర్ధవంతంగా వినియోగించుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు వంటి విషయాలపై ప్రధానంగా చర్చించామని షెకావత్ చెప్పుకొచ్చారు.

ఇరు రాష్ట్రాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన డి పి ఆర్ లు సమర్పించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు.వారు అందజేసిన డి పి ఆర్ లను పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సుప్రీంకోర్టులో జలాల పంపిణీకి సంబంధించి ఉన్న కేసును కేసీఆర్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారని గజేంద్ర సింగ్ షెకావత్ పత్రికాముఖంగా తెలిపారు.ఇరు రాష్ట్రాల నదీజలాల వాటాల నిర్ణయం సంబంధిత నదీ బోర్డులే తీసుకుంటాయని కేంద్ర మంత్రి స్పష్టీకరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube