కూతురు సినిమా ఆపాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్న మాజీ సైనికుడు  

Disha\'s father wants Ram Gopal Varma film banned, Tollywood, Telugu Cinema, South Cinema, Disha Encounter Movie, RGV - Telugu Disha Encounter Movie, Disha\\'s Father, Ram Gopal Varma, Rgv, South Cinema, Telugu Cinema, Tollywood

దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాలు చేసిన సైనికులకి దేశంలో సరైన గౌరవం లభించదు.చాలా మంది మాజీ సైనికులు బ్రతుకు పోరాటంలో ఓడిపోతున్నారు.

TeluguStop.com - Dishas Father Wants Ram Gopal Varma Film Banned

బోర్డర్ లో శత్రువులతో పోరాడిన వాళ్ళు స్వస్థలంలో ఉన్న దుర్మార్గులతో పోరాడలేకపోతున్నారు.సమాజంలో కొంత మంది తమ స్వప్రయోజనం కోసం చేస్తున్న నీచమైన పనులకి, మదమెక్కిన కొంత మంది క్రూరమృగాలు దాటికి తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ లో ఏడాది క్రితం ఓ నలుగురు కామాంధుల చేతిలో బలైన దిశ తండ్రి కూడా అలాగే తన ఆవేదనని చెప్పుకుంటున్నారు.డాక్టర్ అయిన కూతురుని చూసి మురిసిపోయే తండ్రికి నలుగురు కామాంధుల రూపంలో జరిగిన దాడి ఆమెని కళ్ళముందు నుంచి తీసుకుపోయింది.

TeluguStop.com - కూతురు సినిమా ఆపాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్న మాజీ సైనికుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ఆ మాజీ సైనికుడుకి ఇప్పుడు ఆర్జీవీ తెరకెక్కుస్తున్న దిశ సినిమా రూపంలో మరింత అవమానం జరుగుతుందని ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు.

తన కూతురు జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు.ఆర్జీవీ ఎలా అయినా దిశ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.దీనిపై ఇప్పటికే ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నాడు.దిశ సినిమాని తెరకెక్కించడం, రిలీజ్ చేయడం ద్వారా తమ కుటుంబానికి జరిగిన విషాదాన్ని మరో మారు చూపించి, తన కూతురుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అంటున్నారు.

మనుషుల జీవితాలని, ఒకరి కష్టాన్ని ఇష్టం వచ్చినట్లు తెరపై చూపించి పైశాచిక ఆనందం పొందుతున్న అలాంటి వారితో పోరాటం చేయాల్సిన పరిస్థితి దేశం కోసం ఫైట్ చేసిన తనకి వచ్చిందని తన ఆవేదనని మీడియాతో పంచుకున్నారు.

#Ram Gopal Varma #DishaEncounter #Disha's Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు