హాలీవుడ్ ఆఫర్‌ను పక్కనబెట్టిన లోఫర్ బ్యూటీ  

Disha Patani Rejects Hollywood Offer, Disha Patani, Loafer, Bollywood News, Hollywood Offer - Telugu Bollywood News, Disha Patani, Hollywood Offer, Loafer

టాలీవుడ్‌లో లోఫర్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ, ఆ తరువాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడే సెటిల్ అయ్యింది.తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా అమ్మడికి ఇక్కడ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.

 Disha Patani Rejects Hollywood Offer

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లోఫర్ చిత్రంలో హీరోగా వరుణ్ తేజ్ నటించగా హీరోయిన్‌గా దిశా పటానీ అందాల కనువిందు చేసింది.ఇక బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేయడమే కాకుండా అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘రాధే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ బ్యూటీ ఓ అద్భుతమైన ఆఫర్‌ను వదులుకుందట.హాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ అదిరిపోయే ఆఫర్‌ను దిశా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ ఆఫర్‌ను పక్కనబెట్టిన లోఫర్ బ్యూటీ-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఆమె ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.కాగా తాను సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా బాలీవుడ్‌లోనే ఉంటానంటోంది ఈ బ్యూటీ.

తన అందాల ఆరబోతతో అదిరిపోయే ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుత పరిస్థితిల కారణంగా ఇంటికే పరిమితం అయ్యింది.

సోషల్ మీడియాలో ఎక్కవ యాక్టివ్‌గా ఉండే దిశా, హాట్ హాట్ అందాల ఆరబోతతో అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల కోసం ఆమె అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.మరి ఈ బ్యూటీ బాలీవుడ్‌లో రాధే సినిమాతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంటుందో లేదో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Hollywood Offer #Loafer #Disha Patani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Disha Patani Rejects Hollywood Offer Related Telugu News,Photos/Pics,Images..