ఆ ఇద్దరి మధ్య చెడిందట.. ఇప్పుడు ఎవరికీ వారే అంటున్నారు  

Disha Patani And Tiger Sharf\'s Are Seperated-telugu Bollywood News Updates,telugu Viral News Updates,tiger Sharf,viral In Social Media

మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన లోఫర్ మూవీ లో నటించిన దిశా పటాని గురించి అందరికీ తెలిసిందే. ఆమె సినిమాలలో నటించి పాపులారిటీ సంపాదించడం కంటే ఇతర అంశాలతో చాలా పాపులర్ అయ్యింది. ఎం ఎస్ ధోని,భాగీ సీక్వెల్,సల్మాన్ ఖాన్ భారత్ మూవీల్లో మెరిసింది..

ఆ ఇద్దరి మధ్య చెడిందట.. ఇప్పుడు ఎవరికీ వారే అంటున్నారు -Disha Patani And Tiger Sharf's Are Seperated

అయితే భాగి సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ పక్కన నటించి రీల్ లైఫ్ లో రొమాన్స్ పండించిన ఈ బ్యూటీ,రియల్ లైఫ్ లో కూడా టైగర్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఒకప్పటి హీరో జాకీ ష్రాఫ్ కొడుకే ఈ టైగర్ ష్రాఫ్. బాలీవుడ్ లో కండల వీరుడుగా నిలిచిన టైగర్ బాలీవుడ్ రాంబో గా పేరు తెచ్చుకున్నాడు.

అయితే టైగర్ తో దాదాపు రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న దిశా ఎక్కడ పడితే అక్కడ కనిపించి నిత్యం వార్తల్లో నిలిచే ఈ జంట ఇప్పుడు విడిపోయినట్లు తెలుస్తుంది. వారిద్దరూ కూడా ఇప్పుడు ఎవరికీ వారే అంటూ వేరు వేరుగా స్టేట్స్ మెంట్స్ ఇవ్వడం తో ఈ విషయం బాగా అర్ధం అవుతుంది.

అయితే అసలు వీరి మధ్య ఏమి జరిగింది,ఎందుకు విడిపోయారు అన్న విషయంపై ఆరా తీయగా, కొత్త విషయం తెలిసింది. టైగర్ ఇటీవల ఎక్కువగా ఇతర అమ్మాయిలతో తిరుగుతున్నాడు అన్న క్రమంలో దిశా అతనికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క టైగర్ ష్రాఫ్ తో కటీఫ్ చెప్పిన ఈ పొడుగుకాళ్ల సుందరి ఇప్పుడు మహారాష్ట్ర లో యంగ్ పొలిటీషన్ గా ఎదుగుతున్న ఆదిత్య ఠాక్రే కు దగ్గరౌతున్నట్లు తెలుస్తుంది. ఆదిత్య ఠాక్రే బాల ఠాక్రే కు మనవడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆదిత్య తో దిశా ఒక పబ్ లో కూడా మెరిసింది..