మా బిడ్డకు తగిన న్యాయం జరిగింది  

Disha Parents Are Happy-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్య కేసులో నిందితులు ఎంకౌంటర్ అయిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటన పై దిశ తల్లిదండ్రులు స్పందించారు.

Disha Parents Are Happy- Telugu Viral News Disha Parents Are Happy--Disha Parents Are Happy-

తమ బిడ్డ మళ్లీ తిరిగి రాదు కానీ, ఆమె ఆత్మకు మాత్రం శాంతి కలుగుతుంది అంటూ వారు తెలంగాణా పోలీసుల చర్యపై హర్షం వ్యక్తం చేశారు.చనిపోయిన తమ బిడ్డకు తగిన న్యాయం జరిగింది అని సంతోషం వ్యక్తం చేశారు.

ఇక పై మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ ఎంకౌంటర్ దెబ్బ తో మహిళల తో అసభ్యంగా ప్రవర్తించాలి అనుకొనే వారి గుండెల్లో వణుకు పుట్టాలి అని దిశ తల్లిదండ్రులు కోరారు.

ఫిర్యాదు సమయంలో పెద్దగా స్పందించని పోలీసులు కేవలం 8 రోజుల్లోనే మా బిడ్డకు న్యాయం జరిగేలా చేశారు అని ఇప్పుడు వారు కరెక్ట్ పని చేశారు అంటూ హర్షం వ్యక్తం చేశారు.గతనెల నవంబర్ 27 బుధవారం రాత్రి షాద్ నగర్ లోని చటాన్ పల్లి వద్ద ఒంటరిగా ఉన్న దిశ ను నలుగురు తోడేళ్లు లా మాటువేసి అత్యాచారం,హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లు బికాయి.ఈ ఘటనకు కారకులు అయిన నిందితులకు సరైన శిక్ష విధించాలి అంటూ పలువురు డిమాండ్ చేశారు.

అయితే విచారణ కోసం అని నిందితులను కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం అని సంఘటనా స్థలం కి తీసుకువెళ్లగా అక్కడ పోలీసుల కళ్లు గప్పి వారి ఆయుధాలను లాక్కొని పారిపోవాలని ప్రయత్నించడం తో వారిని ఎంకౌంటర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.దీనితో దిశ ఘటన పై ఆగ్రహజ్వాలలతో ఊగిపోతున్న ప్రజలు ఈ ఎంకౌంటర్ వార్త వినగానే సంబరాల్లో మునిగిపోయారు.

సరైన శిక్ష విధించారు అంటూ తెలంగాణా పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు.

తాజా వార్తలు