ఇటీవల అత్యాచారంకు గురై హత్యగావించబడ్డ ప్రియాంక రెడ్డి కేసు విషయంలో విచారణ చాలా స్పీడ్‌గా సాగుతుంది.ప్రియాంక రెడ్డి పేరును ఉపయోగించకుండా దిషా అనే పేరును ఉపయోగించాంటూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించిన విషయం తెల్సిందే.అందుకే మీడియా కూడా అంతా దిషా అంటూ మాట్లాడుతూ ఉన్నారు.ఇక దిషా హత్యాచార నిందితులను తాజాగా పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్బంగా మీరు అంతగా ఒక మనిషిని హింసించి రేప్ చేసి చంపేయాలని ఎలా అనిపించిందంటూ పోలీసులు ప్రశ్నించగా వారు ఆశ్చర్యకర విషయం చెప్పారు.పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నిందితులు రేప్‌కు షాకింగ్ కారణం చెప్పారు.తాగిన మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా చేశామని, హత్య చేయడం తమ ఉద్దేశ్యం కాదు అంటూ వారు చెప్పారట.అసలు ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కూడా అవ్వడం లేదని నిందితులు చెబుతున్నారు.మరో వైపు ఆ నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.నడి రోడ్డు మీద వారిని చంపేయాలంటూ పోలీసులపై ప్రజలు దాడులు చేస్తున్నారు.