మనిషిని ఒక్కరోజులో చంపగల వ్యాధులు ఇవి  

  • మనిషి శరీరం అన్నాక ఎన్నోరకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని మన అలవాట్ల వలన వస్తే, కొన్ని మన ప్రమేయం లేకుండా దురదృష్టంకొద్ది వస్తాయి. అయితే, చాలారకాల వ్యాధులు ముందే వస్తున్నట్లు సంకేతాలు ఇస్తాయి. కొన్నిటిని వచ్చాక గుర్తుపట్టగలం. ఏదెమైనా, బ్రతికెందుకు కొంత సమయం దొరుకుతుంది. కాని కొన్ని వ్యాధులు అలా కాదు. ఒక్కరోజులోనే చెంపేయగలవు ఇవి. అంత ప్రమాదకరమైన వ్యాధులేంటో తెలుసుకోండి.

  • * ఎంటోరోవైరస్ D68 అనే ఇంఫెక్షన్ శరీరంలోకి చేరిందంటే, శ్వాసక్రియను పూర్తిగా దెబ్బతీసి కొన్ని గంటల్లోనే ప్రాణాల్ని తీసేసుకుంటుంది.

  • * ఛాగస్ అనే చాలా అరుదైన వ్యాధి చాలా తొందరగా శరీర భాగాలపై ప్రభావం చూపుతుంది. వెంటనే ట్రీట్‌మెంటు మొదలుపెడితే తప్ప, గుండెను కొద్దిసేపట్లోనే ఆపివేస్తుంది.

  • * డెంగ్యూ కూడా ఒక్కరోజులోనే ప్రాణాన్ని తీయగలదు. సకాలంలో చికిత్స అందకపోతే రక్తప్రసరణను చాలావరకు దెబ్బతీసి చావుని చూపించగల శక్తి డెంగ్యూ జ్వరంలో ఉంటుంది.

  • * ఎబోలా గురించి ఈ మధ్యకాలంలో చాలా వినుంటారు. ఇది తెల్లరక్తకణాలను దెబ్బతీస్తుంది. బాధితుడు రక్తాన్ని కారుస్తూ, ఒక్కరోజులోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది.

  • * కలెరా కూడా మనిషి ప్రాణాన్ని ఒక్కరోజులో తీయగలదు. బ్లడ్ ఫ్లూడ్స్ ని దారుణంగా దెబ్బతీసి, వాంతులు కక్కేలా చేస్తుంది. శరీరం అతిగా డీహైడ్రేట్ అయిపోయి, పనిచేయడం మానేసే ప్రమాదం మోసుకొస్తుంది ఈ వ్యాధి.

  • * MRSA అనే ఇంఫెక్షన్ బ్లడ్ సెల్స్ ని, లంగ్ టిష్యూస్ ని చాలా వేగంగా దెబ్బతీస్తుంది. సమయానికి చికిత్స అందుబాటులో లేకపోతే, కొన్ని గంటల్లోనే మృత్యువు దగ్గరికొస్తుంది.

  • * స్ట్రోక్ అనే జబ్బు మెదడుకి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. స్ట్రోక్ గట్టిగా వస్తే, అప్పటికప్పుడే ప్రాణాలు తీసుకుంటుంది.