తెలంగాణ బీజేపీ లో ' సీఎం ' రగడ ? ఇప్పుడు అవసరమా ?

ఆలూ లేదు .చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారైంది.

 Discution On Bjp Cm Candidate In Telangana, # Kishanreddy, Bandi Sanjay, Bjp, Du-TeluguStop.com

తెలంగాణ బిజెపి పరిస్థితి.గతంతో పోల్చుకుంటే, బిజెపికి జనాల్లో ఆదరణ పెరగడంతో పాటు, అధికార పార్టీ టిఆర్ఎస్ స్థాయికి ఎదిగింది.

ఎన్నికలలో బీజేపీకి దక్కిన డివిజన్లు, దుబ్బాక ఉప ఎన్నికలలో గెలుపు, ఇవన్నీ పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకొస్తున్నాయి.ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుకునేందుకు, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది.

దీని కోసం ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి ,కేంద్ర బిజెపి పెద్దల వరకు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ, పార్టీని మరింత బలోపేతం అయ్యే విధంగా కృషి చేస్తున్నారు.ఇదిలా ఉంటే అకస్మాత్తుగా తెలంగాణ బిజెపి లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై చర్చ మొదలైంది.

వాస్తవంగా చెప్పుకుంటే బిజెపిలో ఎప్పుడూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయం పై చర్చ జరగదు.పార్టీ అధిష్టానం ఆ సమయానికి ఎవరికి ఇవ్వాలి అనకుంటే వారికి కేటాయిస్తుంది తప్ప నాయకుల ఒత్తిడి అనేది ఉండదు.

ఈ విషయం తెలంగాణ బిజెపి నాయకులకు బాగా తెలుసు.అయినా ఇప్పుడు అకస్మాత్తుగా బీజేపీ ఎంపీ సోయం బాబూరావు తెలంగాణకు కాబోయే సీఎం కిషన్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యల పై బహిరంగంగా ఎవరు విమర్శలు చేయకపోయినా, లోలోపల మాత్రం ఈ వ్యవహారంపై చర్చ తీవ్రంగానే జరుగుతోంది.

Telugu Kishan, Amithsha, Bandi Sanjay, Dubbaka, Greter, Modhi, Soyam Baburao, Te

తెలంగాణలో కిషన్ రెడ్డి కి ఉన్న స్థానం ప్రత్యేకం.మొదటి నుంచి బీజేపీని నమ్ముకునే పనిచేస్తున్నారు.ఆయన వివిధ పదవులు నిర్వహిస్తూ, పార్టీ కోసం కృషి చేస్తూ వస్తున్నారు.

కొద్ది నెలల క్రితమే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమించిన తర్వాత పార్టీ లో కాస్త ఊపు కనిపిస్తోంది.ఆ ఊపుతోనే ముందుకు వెళ్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

దీంతో కిషన్ రెడ్డి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.అయితే బీజేపీ అధిష్టానం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఆయనను నియమించి ఆయన ప్రాధాన్యాన్ని తెలియజేసింది.

సమిష్టిగా అంతా టిఆర్ఎస్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సమయంలో, కిషన్ రెడ్డి కాబోయే సీఎం అంటూ హడావుడి మొదలు కావడం వెనక బండి సంజయ్ దూకుడే కారణంగా తెలుస్తోంది.

ఆయన క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా బలం పెంచుకుంటూ బీజేపీ పెద్దల దృష్టిలో పడటంతో పాటు, స్వయంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి బండి సంజయ్ అభినందించిన తీరు కిషన్ రెడ్డి వర్గంలో కాస్త అసహనం కలిగించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బిజెపి గెలుస్తుంది అని ఆ పార్టీ నాయకులు నమ్మకంతో ఉండటంతోనే, ఇప్పటి నుంచి సీఎం పదవి కోసం ప్రయత్నిస్తూ తమ అనుకూల వర్గం ద్వారా ఈ విధంగా ప్రచారాన్ని మొదలు పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.పైకి ఎక్కడా ఈ వ్యవహారాలపై ఆ పార్టీ నాయకులు స్పందించకపోయినా, అంతర్గతంగా సీఎం నినాదం తెరపైకి రావడంపై చర్చించుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube