ఢిల్లీ కి చేరిన రాజు గారి ' యుద్ధం ' ? 

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.సిఐడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 Discussion On Raghurama Krishnaraja Case At Delhi Level-TeluguStop.com

ఆయన పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం,  కాళ్లకు దెబ్బలు కనిపించడం ఈ విషయాన్ని కోర్టుకు రఘురామ కృష్ణంరాజు చెప్పడంతో పెద్ద వివాదం రేగింది.  దీనిపై కోర్టు ఆదేశాలతో ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

దానికి సంబంధించిన రిపోర్ట్ సుప్రీం కోర్టుకు చేరింది.  దీనిపై ఏ తీర్పు వెలువడుతుంది అనేది టెన్షన్ గానే ఉంది.

 Discussion On Raghurama Krishnaraja Case At Delhi Level-ఢిల్లీ కి చేరిన రాజు గారి యుద్ధం  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిఐడి పోలీసులపై తమకు నమ్మకం లేదని , ఆయనను వారు కస్టడీలో కొట్టారు కాబట్టి , అక్కడ రఘురామ కు ప్రాణభయం ఉంది కాబట్టి సిఐడి నుంచి తప్పించి సిబిఐ లేదా సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

అంతేకాకుండా ఈ విషయమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు వేశారు.అసలు రఘురామను సిఐడి కస్టడీలో కొట్టారా లేదా అనేది పెద్ద మిస్టరీ గా మారింది.

ఈ విషయం పెద్ద సంచలనం మారేలా కనిపిస్తోంది.రఘు రామ కుటుంబ సభ్యులతో పాటు,  టిడిపి జనసేన పార్టీ లు రఘురామ ను పోలీసులు కొట్టారు అంటూ ప్రచారం చేస్తోంది.

ఇక  కుటుంబ సభ్యులు ఒక వైపు బిజెపి పెద్దలను కలుస్తూనే,  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.సుప్రీంకోర్టు వరుసగా కేసులు వేస్తున్నారు.

ఏపీలో ఎటువంటి విచారణ జరగకుండా పడుతున్నారు.

Telugu Amith Sha, Ap, Arrest Case, Cbi, Cid, Delhi Level, Discussion, Jagan, Janasena, Mp Raghurama Krishnam Raju, Mp Ragurama Krishnam Raju, Narasapuram Mp, Police, Rahgurama Krishnama Raju Family, Supreme Court, Tdp, Ycp Rebel Mp, Ysrcp-Telugu Political News

అలాగే రఘు రామ కు తప్పకుండా బెయిల్ వస్తుందని, ఇదంతా ప్రభుత్వం కుట్రగా తేలిపోతుందని,  ఆయనకు గతం కంటే ఎక్కువ ఇమేజ్ వస్తుందని వైసిపి వ్యతిరేక పార్టీలతో పాటు కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
  అయితే ఇప్పుడు వరకు కేంద్ర బిజెపి పెద్దలు ఈ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో, వారి వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.మొత్తంగా దేశవ్యాప్తంగా రఘురామ అరెస్టు వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.

#Ycp Rebel Mp #MpRagurama #Amith Sha #MPRaghurama #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు