టీడీపీ జనసేన పొత్తు : సీట్ల సర్దుబాటు ఇలా చేసేస్తున్నారుగా ? 

ఏపీలో ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైనట్లుగా సందడి కనిపిస్తోంది.అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

 Discussion Between Tdp Janasena On Just Adjusting Assembly Election Seats Janase-TeluguStop.com

అదే విధంగా రాజకీయపార్టీల మధ్య పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.దీనికి కారణం ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగమే.

వైసిపి వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని,  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు తనకు ఇష్టం లేదని పవన్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఆశలు చిగురించాయి.ప్రస్తుతం జనసేన, బీజేపీ  పార్టీలు పొత్తు కొనసాగిస్తున్నాయి.

కానీ టీడీపీ ని కలుపు కు వెళ్లేందుకు బీజేపీ  ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయినా సరే బీజేపీ , టీడీపీలు మాత్రం పొత్తు విషయంలో సీరియస్ గానే వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతే కాదు అప్పుడే సీట్ల సర్దు బాటు వ్యవహారం కూడా మొదలైనట్లుగా హడావుడి కనిపిస్తోంది.జనసేన కు ఏపీ వ్యాప్తంగా 25 స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ  సిద్దంగా ఉండగా, జనసేన మాత్రం కనీసం 50 స్థానాలు వరకు జనసేనకు కేటాయించాలని షరతులు కూడా విధిస్తోందట.

అయితే ఈ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు.బీజేపీతో పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చేసుకుంటే మంచిదనే అభిప్రాయం అటు జనసేన,  ఇటు టీడీపీ లో ఉందట.

ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు , ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు,  పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ జిల్లాల్లోనే జనసేన పోటీ చేసేందుకు మొగ్గు చూపిస్తోంది.

Telugu Ap, Janasena, Janasenatdp, Pavan Kalyan, Ysrcp-Telugu Political News

టీడీపీని కలుపు వెళ్లేందుకు బీజేపీ  ఒప్పుకోకపోతే ఏం చేయాలనే విషయంపై ప్రస్తుతం జనసేన టీడీపీ లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం .అందుకే బహిరంగంగా ఎక్కడా ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు, తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు టీడీపీ  ఇష్టపడడం లేదు.క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఖాయమనే అభిప్రాయం రెండు పార్టీల నాయకులలోను స్పష్టంగా కనిపిస్తోంది.అంతే కాకుండా గతంలో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం , ఇటీవల జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లోనూ చాలా చోట్ల జనసేన టీడీపీ కి మద్దతుగా నిలబడ గా జనసేన కుటీడీపీ  అలాగే సహకరించింది.

ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఇబ్బందేమీ లేదు అనే అభిప్రాయాలు రెండు పార్టీల నేతల్లోనూ ఉన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube