నీకు పడిపోతాన‌న్న అరియానా.. ఛీ కొట్టిన అవినాష్‌!

తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌లో ప‌దో వారం కొన‌సాగుతోంది.ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అరియానా, మెహ‌బూబ్‌, అవినాష్‌, లాస్య‌, అభిజిత్‌, మోనాల్‌, హారిక‌, సొహైల్ ఉండ‌గా.

 Discussion Between Avinash And Ariyana! Avinash, Ariyana, Discussion, Latest New-TeluguStop.com

సీక్రెట్ రూమ్‌లో అఖిల్ ఉన్నారు.ఇక దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా.

నిన్న‌టి ఎపిసోడ్ మొత్తం ఎంతో స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది.బిగ్ బాస్ ఇంటి స‌భ్య‌ల‌కు గిఫ్ట్స్ కూడా పంపారు.

ఇదిలా ఉంటే.నిన్న‌టి ఎపిసోడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం కూడా చోటుచేసుకుంది.

Telugu Ariyana, Avinash, Biggboss, Latest, Tollywood-Movie

హౌస్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రో ఒక‌రితో పులిహోర క‌లుపుతున్న అవినాష్‌.నిన్న మ‌రో సారి అరియానాకు బిస్కెట్లు వేసే ప్ర‌య‌త్నం చేశారు.మొద‌ట మెహ‌బూబ్‌తో అరియానా భ‌లే బాగుంటుంది క‌దా అని అవినాష్ అన‌డంతో.అత‌డు మాత్రం నాకు తెలియ‌దు అంటూ జారుకున్నారు.ఇక అక్క‌డే ఉన్న అరియానా మాత్రం న‌వ్వుకుంటూ.నా ముందే ఇద్దరు ముగ్గుర్ని అందంగా ఉంటావ‌ని చెప్పావ్, ఇప్ప‌డు నాకు చెప్పావ్.

అయినా నీకు ప‌డ‌ను అని పంచ్ వేసింది.

Telugu Ariyana, Avinash, Biggboss, Latest, Tollywood-Movie

దీంతో `నువ్ నాకు ప‌డ‌టం ఏంటీ.అవసరమే లేదు ఛీ ఛీ. అయినా నీకూ అంత సీన్ లేదూ.నాకూ అంత సీన్ లేదు.అసలు నాకు ఆ ఆలోచనే లేదు. మనం ఫ్రెండ్స్ అంతే` అంటూ మెద‌ట పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నించిన అవినాష్‌నే టాపిక్‌ను డైవ‌ర్ట్ చేయాల‌ని చూశారు.కానీ, ఈ సారి అరియానా మాట మార్చి `నేను పడిపోతా` అని కామెడీగా చెప్పింది.

Telugu Ariyana, Avinash, Biggboss, Latest, Tollywood-Movie

అయిన‌ప్ప‌టికీ అవినాష్ మాత్రం.మనం ఫ్రెండ్స్ ఎందుకు పడతాం అంటూ టాపిక్‌ను డైవ‌ర్ట్ చేస్తూ కాసేపు కామెడీ చేశాడు‌.ఇక అనంత‌రం అరియానా పింక్ క‌ల‌ర్ శారీ క‌ట్టుకోగా.అవినాష్ కూడా పింక్ క‌ల‌ర్ షర్ట్ వేసుకున్నాడు.దీంతో అరియానా నా కోస‌మే పింక్ ష‌ర్ట్ వేసుకున్నావా అని ప్ర‌శ్నించ‌గా.అవినాష్ `నీకు అంత లేదు.

ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయకు.నీకోసం నేనెందుకు వేసుకుంటా` అంటూ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు.

మొత్తానికి అవినాష్‌- అరియానా ట్రాక్ నిన్న‌టి ఎపిసోడ్‌లో బాగానే హైలైట్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube