బిగ్‌బాస్‌ : ఈ వారం కూడా సిల్లీగా అదే చర్చ  

Discussion about this week big boss 4 hosting, Bigg Boss4, nagarjuna, ramya krishna, samantha, week end host, wild dog shooting - Telugu Bigg Boss4, Discussion About This Week Big Boss 4 Hosting, Nagarjuna, Ramya Krishna, Samantha, Week End Host, Wild Dog Shooting

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో ఒక వారం నాగార్జున హోస్టింగ్‌ చేయకుండా ఆ బాధ్యతను రమ్యకృష్ణకు అప్పగించాడు.అలాంటి సీన్‌ మరోసారి రివర్స్‌ కాబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - Discussion About This Week Big Boss 4 Hosting

వరుసగా మూడు వారాల నుండి ఇవే వార్తలు వస్తున్నాయి.తెలుగు బిగ్‌ బాస్‌ కు ఈసారి కూడా మరో లేడీ హోస్ట్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్‌ డాగ్‌ అనే సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఆలస్యం అవుతుంది.

TeluguStop.com - బిగ్‌బాస్‌ : ఈ వారం కూడా సిల్లీగా అదే చర్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కరోనా కారణంగా ఆలస్యం అయిన ఆ సినిమాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్‌ కోసం వెళ్లారు.అక్కడ షూటింగ్‌ జరుపుకునేందుకు కనీసం మూడు వారాలు అయినా పడుతుంది.

అందుకే నాగార్జున అటు ఇటు తిరగడం ఇబ్బంది.అందుకే ఈ సమయంలో లేడీ హోస్ట్‌గా ఎవరో ఒకరు వస్తారని అంతా అనుకుంటున్నారు.

గత సీజన్‌ లో మాదిరిగా నాగార్జున స్థానంలో రమ్యకృష్ణను కాకుండా రోజాను తీసుకు వస్తున్నారు అంటూ గత వారం వార్తలు వచ్చాయి.షో ప్రోమో వచ్చే వరకు రోజా హోస్ట్‌ అంటూ అంతా బలంగా నమ్మారు.

కాని చివరకు రమ్యకృష్ణ కాదు, రోజా కాదు నాగార్జున అంటూ ప్రోమో వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చేసింది.ఇక ఈ వారంలో అయితే నాగార్జున స్థానంలో సమంత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

శనివారం ఎపిసోడ్‌ కోసం అంతా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో కొనసాగుతున్న ఈ పుకారు మరీ సిల్లీగా అనిపించినా కూడా ప్రతి వారం ప్రేక్షకులు నమ్ముతూనే ఉన్నారు.

కొందరు మీడియా వారు ప్రచారం చేస్తునే ఉన్నారు.ఈసారి నిజంగానే సమంత వచ్చినా కూడా కొందరు నమ్మరేమో అనిపిస్తుంది.

కొందరు మాత్రం ఇది నిజం అయితే బాగుండు కదా అంటున్నారు.మొత్తానికి ఏం జరుగుందో చూడాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

నాగార్జున హోస్టింగ్‌లో బిగ్‌ బాస్‌ షోకు మంచి రేటింగ్‌ వస్తున్న సమయంలో ఇతర హోస్ట్‌లు ఎందుకు అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ వారం కొత్త హోస్ట్‌ నిజం కాకుంటే ఖచ్చితంగా మరోసారి ఎవ్వరు కూడా నమ్మక పోవచ్చు

.

#Week End Host #Samantha #DiscussionAbout #Bigg Boss4 #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Discussion About This Week Big Boss 4 Hosting Related Telugu News,Photos/Pics,Images..